బాలియా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలియాలో ఇద్దరు యువకులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. 

అత్యాచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై కూడా కేసు నమోదు చేశారు. 

సంఘటనా స్థలం మీదుగా వెళ్తున్న కొంత మంది ఆ వీడియో తీసినట్లు తెలుస్తోంది. వీడియో తీసిన తర్వాత దాన్ని వాళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో అది వైరల్ అవుతూ వస్తోంది. 

ఐటి చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి దాడులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు విరివిగా జరుగుతున్న విషయం తెలిసిందే.