ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠిపై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి,మరో ఆరుగురు కలిసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తోంది. 2017లో రవీంద్రనాథ్, అతని మేనల్లుడితో మరో ఐదుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఫిబ్రవరి 10న ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బాధితురాలి ఆరోపణల ప్రకారం... ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మేనల్లుడు సందీప్ తివారితో ఆ మహిళలకు రైల్లో పరిచయం ఏర్పడిండి. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆరేళ్ల పాటు వారిద్దరి మధ్య సంబంధం కొనసాగింది. ఆ తర్వాత పెళ్లి మాటెత్తే సరికి తనను వేధించడం మొదలుపెట్టాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది.

Also Read హోటల్ గదిలో బంధించి అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణలు...

అనంతరం 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ హోటల్‌లో తనను నిర్బంధించి అత్యాచారం చేశారని తెలిపింది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠితో పాటు చంద్రభూషణ్ సింగ్ త్రిపాఠి, దీపక్ తివారి, నితీష్ తివారి, ప్రకాశ్ తివారి 30 రోజుల పాటు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. అప్పట్లో తాను గర్భం కూడా  దాల్చానని.. కానీ ఒత్తిళ్ల కారణంగా అబార్షన్ చేయించుకున్నట్లు చెప్పింది. 

మొదట ఎమ్మెల్యే మేనల్లుడిపై మాత్రమే కేసు పెట్టిన ఆమె.. ఇప్పుడు మరో ఐదుగురిపైనా ఫిర్యాదు చేసింది. సదరు మహిళ ఫిర్యాదు ఆధారంగా ఆ ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. తనపై వస్తున్న ఆరోపణలను సదరు ఎమ్మెల్యే ఖండిస్తున్నారు. 

సదరు మహిళ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. తనతోపాటు తన కుటుంబం మొత్తం ఉరి కంబం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎమ్మెల్యే పేర్కొనడం గమనార్హం.