మరో బీజేపీ ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పటికే పలవురు బీజేపీ నేతలు పలు కేసుల్లో ఇరుక్కోగా తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి,మరో ఆరుగురు కలిసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

Also Read ఉన్మాది దాడిలో గాయపడిన లెక్చరర్ అంకిత మృతి: వార్ధాలో ఉద్రిక్తత...

పూర్తి వివరాల్లోకి వెళితే... యూపీలోని బదోహి ప్రాంతానికి చెందిన ఓ మహిళ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠిపై సంచలన ఆరపణలు చేశారు.  భర్తను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న తనకు ఎమ్మెల్యే మేనల్లుడు 2014లో పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు.

ఆ తర్వాత 2017  యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మేనలుడు తనను బదోహిలోని ఓ హోటల్ కి తీసుకువెళ్లాడని ఆమె చెప్పింది. అక్కడ తనను నిర్భందించాడని వాపోయింది. ఆ హోటల్ కి ఎమ్మెల్యే మరో ఆరుగురు వారి కుటుంబసభ్యులు అక్కడకు వచ్చారని.. వారంతా కలిసి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.