విహారయాత్రలో విద్యార్థినిపై రేప్.. బిడ్డను ప్రసవించిన విద్యార్థిని

Unaware teen delivers baby girl after sexual assault by classmate
Highlights

ఆమె సహ విద్యార్థి అయిన ఓ యువకుడు బాలికతో మద్యం తాగించి మత్తులో ఉండగా ఆమెపై అత్యాచారం జరిపాడు. 

తోటి విద్యార్థులతో కలిసి విహార యాత్రకు వెళితే.. దానిని అవకాశంగా తీసుకొని విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దానికి ప్రతిఫలంగా ఆ విద్యార్థిని నెలలు కూడా నిండకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విద్యార్థిని అసలు తల్లి అయ్యిందన్న విషయం కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియకపోవడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...మైనర్ బాలిక పూణే నగర పరిధి ఎరవాడలోని ఓ ప్రముఖ కళాశాలలో 11వతరగతి చదువుతోంది. గత ఏడాది డిసెంబరు నెలలో బాలిక కళాశాల స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. విహార యాత్ర నుంచి విద్యార్థులు తిరిగి వెళ్లిపోగా ఏదో పని ఉండగా ఆమె ఉండిపోయింది. దీంతో ఆమె సహ విద్యార్థి అయిన ఓ యువకుడు బాలికతో మద్యం తాగించి మత్తులో ఉండగా ఆమెపై అత్యాచారం జరిపాడు. 

మూడు నెలల తర్వాత గతంలో అత్యాచారం చేసిన వీడియో తన వద్ద ఉందని దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి పరువు తీస్తానని బెదిరించి సహ విద్యార్థి ఆమెపై పలుసార్లు అత్యాచారం జరిపాడు.  కాగా.. ఒక రోజు కాలేజీలో బాలిక తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావంతో బాధపడుండగా.. ఆస్పత్రిలో చేర్పించారు. 

ఆసుపత్రిలో కళాశాల బాలిక నెలలు నిండని ఆడబిడ్డకు జన్మనివ్వడంతో బాలిక తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.  ఆమెను ఆసుపత్రికి తీసుకొని వెళ్లే వరకూ గర్భం దాల్చిందనే విషయం తమకు తెలియదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. తల్లీ పిల్ల క్షేమంగా ఉన్నారని, శిశువు గురించి ఏం చేయాలనేది తాము నిర్ణయం తీసుకుంటామని బాధిత బాలిక తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులు నిందితుడైన బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన బాలల సదనానికి తరలించారు.

loader