Feb 24 : Top Ten News @6PM: ఏషియానెట్‌లో టాప్ 10 వార్తలు

ఫిబ్రవరి 24, 2024న ఏషియానెట్‌లో సాయంత్రం 6 గంటల వరకు టాప్ 10 వార్తలు ఇవే.

top ten news at 6 pm on asianet news roja satires on pawan kalyan jhanvi kapoor decision bhuma mounika baby bump ksp

టీడీపీ-జనసేన తొలి జాబితా: సీటు దక్కని నేతల్లో అసంతృప్తి, నిరసనలు

తెలుగుదేశం-జనసేన  తొలి జాబితాను ప్రకటించింది.ఈ జాబితాలో  టిక్కెట్లు దక్కని  తెలుగు దేశం పార్టీ శ్రేణులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు నిరసనలకు దిగాయి.తెలుగుదేశం-జనసేన కూటమి ఇవాళ 99 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ  94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 94 మందిలో  23 మంది కొత్త వాళ్లు. అయితే  ఈ జాబితాలో కొందరు సీనియర్లకు టిక్కెట్టు దక్కలేదు. బీజేపీతో  పొత్తు కారణంగా  ఇంకా  57 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మార్చి తొలి వారంలో  అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. పూర్తి కథనం 

పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు .. పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ : పవన్‌పై రోజా ఘాటు విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు వైసీపీ నేత, మంత్రి ఆర్కే రోజా . 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు వున్నారని రోజా చురకలంటించారు. పవన్ పార్టీ ఎందుకు పెట్టారు.. పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 24 సీట్లకే పవన్ తల ఎందుకు ఊపారు... ఏ ప్యాకేజీ కోసం తలవంచారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. పూర్తి కథనం

రాజకీయ పార్టీ ఎలా నడపాలో తెలియదు: పవన్ పై సజ్జల సెటైర్లు

రాజకీయ పార్టీని ఎలా నడపాలనే స్పృహ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేదని  తొలి జాబితా విడుదలతో స్పష్టమైందని  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అభ్యర్థుల ప్రకటనలో పవన్ కళ్యాణ్ ను చూస్తే దయనీయంగా ఉందని ఆయన సెటైర్లు వేశారు. చంద్ర బాబు ఎన్ని సీట్లిస్తే  అన్ని సీట్లే పవన్ కళ్యాణ్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. పొత్తులపై సరైన కారణం కూడా పవన్ కళ్యాణ్ చెప్పాలేక పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పూర్తి కథనం

టీడీపీ జనసేన తొలి జాబితాతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిశాయి : బోండా ఉమా సెటైర్లు

టీడీపీ - జనసేన అభ్యర్ధుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయని బోండా ఉమామహేశ్వరరావు చురకలంటించారు. మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిందని.. తుది జాబితాతో వైసీపీకి మైండ్ బ్లాంక్ తప్పదని ఉమా హెచ్చరించారు. టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించాయని.. అంతా సాఫీగా జరిగిందని, వైసీపీలాగా కుదుపులేమీ లేవని బోండా అన్నారు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ కల్లోలమైందని , ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జారిపోయారని చురకలంటించారు. పవన్ కల్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల .. జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. పూర్తి కథనం

జూలై 1 నుండి అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో ఈ చట్టాలు అమలవుతాయి. ఈ మూడు క్రిమినల్ చట్టాలకు గానూ శనివారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ న్యాయసంహిత-2023,, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023ai.. 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి, 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. పూర్తి కథనం

వేల కోట్ల ఆస్తి, రాయల్‌ లైఫ్‌ నుంచి రోడ్డున పడ్డ జేడీ చక్రవర్తి ఫ్యామిలీ.. ఆ రెండేళ్లు ఏం జరిగింది?

వేల కోట్ల ఆస్తి, రాయల్‌ లైఫ్‌ అనుభవించే జేడీ చక్రవర్తి ఎందుకు సడెన్‌గా రోడ్డున పడ్డారు. చిన్న ఇరుకు ఇంట్లో ఉంటూ, నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. నిన్నటి వరకు పెద్ద బంగ్లా, ఇంట్లో పనివాళ్లు, సినిమాల్లో చూపించినట్టు పెద్ద హంగామా ఉండేది. కానీ కట్‌ చేస్తే నెక్ట్స్ డే నేనే రాజు నేనే మంత్రిలా ఒంటరి అయిపోయినట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పూర్తి కథనం

బేబీ బంప్ చూపిస్తూ భూమా మౌనిక ఫోటో షూట్.. మంచు మనోజ్ కామెంట్ చూశారా

గత ఏడాది మంచు మనోజ్.. భూమా మౌనికని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అన్యోన్యంగా జీవిస్తూ కొత్త లైఫ్ ని ప్రారంభించారు. ప్రస్తుతం భూమా మౌనిక గర్భవతి. త్వరలో మంచు మనోజ్, భూమా మౌనిక తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆ మధ్యన మంచు మనోజ్ తన సతీమణి ప్రెగ్నన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా భూమా మౌనిక బేబీ బంప్ చూపిస్తూ ఫోటో షూట్ చేసింది. బ్యూటిఫుల్ గా ఉన్న ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి కథనం

`భీమా` ట్రైలర్‌.. కరుణే చూపని బ్రహ్మారాక్షసుడు భూమిపైకి వస్తే.. గోపీచంద్‌ విశ్వరూపం..

వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్‌ ఇప్పుడు సక్సెస్‌ కోసం ఓ మాస్‌ యాక్షన్‌ మూవీ `భీమా` అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ వచ్చింది. గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. డివోషనల్‌ అంశాలు, యాక్షన్‌ ఎలిమెంట్లు, థ్రిల్లర్‌ అంశాలతో ఈ ట్రైలర్ సాగింది. గోపీచంద్‌ సరసన ప్రియా భవాని శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. రవి బస్సూర్‌ సంగీతం అందిస్తున్నారు. కెకె రాధా మోహన్‌ నిర్మిస్తున్న చిత్రమిది. పూర్తి కథనం

Devara : ‘దేవర’ విషయంలో సీరియస్ డిసీషన్ తీసుకున్న జాన్వీ కపూర్... ఏంటంటే?

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సందర్భంగా తన సినిమా గురించి అప్డేట్ అందించింది. ఇంకా షూటింగ్ పూర్తికాలేదని, నాలుగు పాటలు చిత్రీకరించాల్సి ఉందని చెప్పింది. తన షూటింగ్ పార్ట్ ఇంకా చాలా వరకు ఉందని చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమా కోసం తను ప్రత్యేకంగా తెలుగు భాషను నేర్చుకుంటున్నట్టు తెలిపారు. తానే సినిమాకు తెలుగు భాషలో సరళంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ’దేవర‘ విషయంలో కీలక నిర్ణయం తీసుకుందంట. పూర్తి కథనం

చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వి జైస్వాల్.. స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుకు ఎస‌రు !

భార‌త్-ఇంగ్లాండ్ 4వ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ఇదే క్ర‌మంలో టెస్టు క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్లు సచిన్ టెండూల్కర్, క‌పిల్ దేవ్ వంటి దిగ్గజాలను అధిగ‌మించాడు. పూర్తి కథనం 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios