టీడీపీ జనసేన తొలి జాబితాతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిశాయి : బోండా ఉమా సెటైర్లు

టీడీపీ - జనసేన అభ్యర్ధుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయని బోండా ఉమామహేశ్వరరావు చురకలంటించారు. మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిందని.. తుది జాబితాతో వైసీపీకి మైండ్ బ్లాంక్ తప్పదని ఉమా హెచ్చరించారు. 

bonda uma maheshwar rao satires on ysrcp leaders over TDP janasena First List ksp

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గాను జనసేన , టీడీపీ తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిందని.. తుది జాబితాతో వైసీపీకి మైండ్ బ్లాంక్ తప్పదని ఉమా హెచ్చరించారు. టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించాయని.. అంతా సాఫీగా జరిగిందని, వైసీపీలాగా కుదుపులేమీ లేవని బోండా అన్నారు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ కల్లోలమైందని , ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జారిపోయారని చురకలంటించారు. 

జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నారని.. టీడీపీ - జనసేన అభ్యర్ధుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయని బోండా ఉమామహేశ్వరరావు చురకలంటించారు. దీంతో సజ్జల తెరమీదకు వచ్చి అవాకులు చవాకులు పేలారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల .. జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. మా పొత్తులు, మా సీట్ల గురించి ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు భయపడుతున్నట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. 

ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉందో లేదో చెప్పాలని.. ఆయన సీటుకే గ్యారెంటీ లేదు.. మళ్లీ టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడతారా అంటూ బోండా ఉమా ధ్వజమెత్తారు. జగన్ ను నమ్మి ఎక్కువ నోరు పారేసుకోవద్దని.. తాను చేసిన తప్పులకు బదిలీలు అని ఇప్పటికే 77 మందిని బలి చేశారని చురకలంటించారు. మళ్లీ మళ్లీ మారుస్తూనే వుంటారని... రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన ఘనవిజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు, ప్రజా పీడనకు స్వస్తి పలుకడం ఖాయమన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios