MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జేడీ చక్రవర్తి వేల కోట్ల ఆస్తులు ఎందుకు పోయాయి?.. రాయల్‌ లైఫ్‌ నుంచి రెంట్‌కి ఉండడం వెనుక కథేంటి?

జేడీ చక్రవర్తి వేల కోట్ల ఆస్తులు ఎందుకు పోయాయి?.. రాయల్‌ లైఫ్‌ నుంచి రెంట్‌కి ఉండడం వెనుక కథేంటి?

వేల కోట్ల ఆస్తి, రాయల్‌ లైఫ్‌ అనుభవించే జేడీ చక్రవర్తి ఎందుకు సడెన్‌గా రోడ్డున పడ్డారు. చిన్న ఇరుకు ఇంట్లో ఉంటూ, నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.. 

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 25 2024, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జేడీ చక్రవర్తి ఒకప్పుడు స్టార్‌ హీరోలకు దీటుగా సినిమాలు చేసి మెప్పించిన హీరో. డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలతో మెప్పించాడు. హీరోగానే కాదు నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి మెప్పించాడు. పాత్ర కంటే కంటెంట్‌కి ప్రయారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవల `దయా` అనే వెబ్‌ సిరీస్‌తో మళ్లీ మెయిన్‌ స్ట్రీమ్‌లోకి వచ్చాడు. ఇకపై రెగ్యూలర్‌గా సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇదిలా ఉంటే ఆ సందర్భంగా జేడీ చక్రవర్తి తన గతం గురించి పలు షాకింగ్‌ విషయాలను పంచుకున్నారు. రాయల్‌ లైఫ్‌ని అనుభవించిన జేడీ చక్రవర్తి రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురయ్యిందని తెలిపారు. తాజాగా జేడీ చక్రవర్తి ఇంటర్వ్యూ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో ఆసక్తికర విషయాలను, ఇప్పటి వరకు బయటకు రాని రహస్యాలను జేడీ చక్రవర్తి పంచుకున్నారు. ఇందులో తన జీవితంలోని రెండేళ్ల బ్యాడ్‌ ఫేజ్‌ని బయటపెట్టాడు. 
 

38

జేడీ చక్రవర్తికి హైదరాబాద్‌లో వందల కోట్లు విలువల చేసే వందల ఎకరాలు ఉండేదట. రాజమండ్రిలోనూ వేల ఎకరాల ల్యాండ్‌ ఉందట. ఈ విషయాన్ని యాంకర్‌ ప్రశ్నించారు. `మీది చిన్నప్పట్నుంచి గోల్డెన్‌ స్ఫూన్‌ అని, డైమండ్‌ స్ఫూన్‌ అని కూడా విన్నాను. గోల్డోండ ఎదురుగా వందల ఎకరాలు జేడీ చక్రవర్తి వాళ్ల ఫాదర్‌ వి అని, అలాగే రాజమండ్రిలోనూ వేల ఎకరాలు ఉండేవని విన్నాను. కానీ మీ ఫాదర్‌ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు, దాన్ని చూసుకోవడం బర్డెన్‌ అయ్యిందా? అని అడగ్గా..
 

48

జేడీ చక్రవర్తి.. నవ్వుతూ ఎక్కడ ఉందో చెబితే తెచ్చుకుంటాను, కొంచెం అడ్రస్‌ ఇవ్వూ అంటూ రియాక్ట్ అయ్యాడు. అయితే అవి లేవు అని మాత్రం ఆయన్నుంచి సమాధానం రాలేదు.ఈ క్రమంలో అసలు విసయాలను బయటపెట్టాడు జేడీ. తన 13ఏళ్ల వయసులో నాన్న చనిపోయాడు. దీంతో అమ్మే అంతా చూసుకుందని తెలిపారు. రాత్రి తనతో పడుకున్న నాన్న మార్నింగ్‌ లేచే సరికి లేకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనని తెలిపారు. ఆ వయసులో ఈ బరువు, బాధ్యతలు పెద్దగా తెలియవని, పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టు చెప్పాడు.
 

58

తన మదర్‌ చాలా బాధగా, భారంగా ఫీలయ్యారట. తల్లి పేరు కోవేల శాంత. ఆమె ఇండియాలోనే హైలీ ఎడ్యూకేటెడ్‌ ఉమెన్‌ అట. ఆమె ఎన్నో ఎమ్‌ఏలు, ఎన్నో డాక్టరేట్లు, పీహెచ్‌డీలు,మ్యూజిక్‌లో ప్రొఫేసర్‌. మ్యూజిక్‌ కాలేజీలో ప్రొఫేసర్‌గా సరదాగా జాబ్‌ చేస్తుండేదట. భర్త చనిపోయినప్పుడు భర్త ఆస్తి భార్యకి రావాలంటే లీగల్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ కావాలట. ఆ సమయలో అమ్మ అది తీసుకుందని తెలిపారు. ఆయనకు ఫస్ట్ వైఫ్‌, లాస్ట్ వైఫ్‌ ఆమెనే అని ప్రభుత్వం సర్టిఫికేట్‌ ఇస్తే నాన్నగారి ప్రాపర్టీస్‌ మాకు వస్తాయి. 

68

అయితే ఆ సర్టిఫికేట్‌ కోసం దాదాపు రెండేళ్లు పట్టిందట. అప్పట్లో దాదాపు ఒక ఎకరం స్థలంలో ఇళ్లు ఉండేదట. పనివాళ్లు ఉండేవారట. లగ్జరీ హోమ్‌ అని, రాయల్‌ లైఫ్‌ ఉండేదని, కానీ నాన్న చనిపోయాక అవన్నీ పోయినట్టు చెప్పాడు. లీగల్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ వచ్చేంత వరకు అన్నీ వదులుకుని చిక్కడపల్లిలో ఒక చిన్న ఇంటిలో రెంట్‌కి ఉండాల్సి వచ్చిందట. దాదాపు రెండేళ్లు స్ట్రగుల్ అయ్యామని, అది మాకు గొప్ప లెసన్‌ అని తెలిపారు. 
 

78

నిన్నటి వరకు పెద్ద బంగ్లా, ఇంట్లో పనివాళ్లు, సినిమాల్లో చూపించినట్టు పెద్ద హంగామా ఉండేది. కానీ కట్‌ చేస్తే నెక్ట్స్ డే నేనే రాజు నేనే మంత్రిలా ఒంటరి అయిపోయినట్టు తెలిపారు. `అన్ని పనులు మేమే చేసుకోవాల్సి వచ్చేది. అంతకు ముందు కార్లల్లో తిరిగిన మేం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది` అని పేర్కొన్నాడు జేడీ చక్రవర్తి. ఓ రకంగా రాయల్‌ లైఫ్‌ నుంచి రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురయ్యిందని, అవన్నీ అమ్మనే ఫేస్‌ చేసిందని వెల్లడించారు జేడీ చక్రవర్తి. రెండేళ్ల తర్వాత నాన్న ఆస్తులు తిరిగి తమకు దక్కాయని పేర్కొన్నారు.
 

88

`శివ` చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు జేడీ చక్రవర్తి. రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడిగా ఆయన సినిమాల్లోకి వచ్చారు. `మనీ` చిత్రంతో మెయిన్‌ హీరోగా మారిపోయాడు. పెద్ద హిట్‌ అందుకుని ఒక్కసారి అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకున్నాడు. `మనీ మనీ`, `గులాబీ`, `దెయ్యం`, `బొంబాయి ప్రియుడు`, `అనగనగా ఒక రోజు`, `ఎగిరే పావురమా`, `నేను ప్రేమిస్తున్నాను`, `పాపే నా ప్రాణం`, `హరిశ్చంద్ర`, `ప్రేమకు వేళయేరా`, `ప్రేమకు స్వాగతం`, `కాశీ`, అలాగే హిందీలో `సత్య` వంటి చిత్రాలతో హీరోగా మెప్పించాడు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారారు. అడపాదడపా మెప్పిస్తున్నాడు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image2
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Recommended image3
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved