రాజకీయ పార్టీ ఎలా నడపాలో తెలియదు: పవన్ పై సజ్జల సెటైర్లు
తెలుగుదేశం, జనసేన తొలి జాబితాపై వైఎస్ఆర్‌సీపీ విమర్శలు గుప్పించింది.
తాడేపల్లి: రాజకీయ పార్టీని ఎలా నడపాలనే స్పృహ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేదని తొలి జాబితా విడుదలతో స్పష్టమైందని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
శనివారంనాడు తెలుగుదేశం, జనసేన పార్టీలు తొలి జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితాపై సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అభ్యర్థుల ప్రకటనలో పవన్ కళ్యాణ్ ను చూస్తే దయనీయంగా ఉందని ఆయన సెటైర్లు వేశారు. చంద్ర బాబు ఎన్ని సీట్లిస్తే అన్ని సీట్లే పవన్ కళ్యాణ్ తీసుకున్నారని ఆయన విమర్శించారు.
also read:టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా విడుదల: 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై సరైన కారణం కూడా పవన్ కళ్యాణ్ చెప్పాలేక పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.సీట్ల సంఖ్య వద్దు విన్నింగ్ ఛాన్స్ చూడాలని పవన్ కళ్యాణ్ చెప్పడం దేనికి సంకేతమని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు.
అప్పనంగా దొరికిన జనసేనను మింగేయలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.87శాతం మంది ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కుప్పంతో సహా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
also read:తొలి జాబితా: టీడీపీ సీనియర్లకు దక్కని చోటు, ఎందుకంటే?
పార్టీ పెట్టీ తన సామాజిక వర్గాన్ని, అభిమానులను పవన్ కళ్యాణ్ మోసం చేశారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ లో ఒక లీడర్ లక్షణం కూడా లేదన్నారు. ఎక్కడ పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. చంద్ర బాబు ఎక్కడ పోటీ చేయమంటే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
also read:అభ్యర్థుల ఎంపికపై కోటి మంది నుండి అభిప్రాయ సేకరణ: చంద్రబాబు
175 నియోజకవర్గాల్లో ఇంచార్జులను కూడా నియమించాలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. 175 స్థానాల్లో టీడీపీకి అభ్యర్థులు లేరన్నారు.బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయం అందించి వైఎస్ఆర్‌సీపీ ఓట్లు చీల్చాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.
ఎవరి మీద యుద్ధం చేస్తావో చెప్పాలని పవన్ కళ్యాణ్ ను ఆయన ప్రశ్నించారు. యుద్ధం చేయాలంటే రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు.సామాజిక న్యాయం విషయంలో వైసీపీని ఎవరు అధిగమించలేరని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.