March 22-Top Ten News: టాప్ టెన్ వార్తలు

ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు.
 

todays top ten news march 22 kms

కేజ్రీవాల్ కీలక కుట్రదారుడు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కీలక కుట్రదారుడని ఈడీ పేర్కొంది. లిక్కర్ పాలసీ స్కాంలో కింగ్ పిన్ అని కోర్టుకు తెలిపింది. కాబట్టి, సీఎంను పది రోజులు రిమాండ్‌కు పంపాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి కథనం

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కేటాయించింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయనను ఖరారు చేసింది. పూర్తి కథనం

ఇస్రో మరో ఘనత

ఇస్రో పుష్పక్ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ (ఆర్ఎల్వీ) ఎల్ఈఎక్స్ 02 ల్యాండింగ్ ప్రయోగాన్ని నేటి ఉదయం విజయవంతంగా నిర్వహించింది. 7.10 గంటలకు కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఈ ప్రయోగం జరిగింది. పూర్తి కథనం

ఆండ్రాయిడ్ కొత్త అప్ డేట్

గూగుల్   అన్యువల్  డెవలపర్ కాన్ఫరెన్స్‌ను ప్రకటించడంతో ఆండ్రాయిడ్ 15కి సంబంధించిన వార్తలు ఇంకా  పుకార్లు సోషల్ మీడియాను వైరల్ అయ్యాయి. పూర్తి కథనం

ఎలక్టోరల్ బాండ్లను విరాళమిచ్చిన టాప్ టెన్ కంపనీలివే

ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న వేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆసక్తికర సమాచారాన్ని బయటపెట్టింది. ఏ కంపనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసాయి... ఏ రాజకీయ పార్టీకి విరాళంగా ఇచ్చాయన్న వివరాలను ఎస్బిఐ ప్రకటించింది.  పూర్తి కథనం

మోడీకి భూటాన్ అత్యున్నత పౌరపురస్కారం

భారత ప్రధాని భూటాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భూటాన్ రాజు ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారం డ్రూకో గ్యాల్పోతో భారత ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు. పూర్తి కథనం

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

ఏపీలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో లిస్టు విడుదల చేసింది. ఇందులో 11 అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పూర్తి కథనం

కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. పూర్తి కథనం

పెళ్లిపీటలు ఎక్కుతున్న బర్రెలక్క

బర్రెలక్క అలియాస్ శిరీష పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మరి అబ్బాయి ఎవరంటే? పూర్తి కథనం

చెన్నైలో దుమ్మురేప‌డానికి సిద్ధ‌మైన విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2024 కు స‌ర్వం సిద్ద‌మైంది. చెన్నై వేదిక‌గా ఘ‌నంగా ప్రారంభ వేడుక‌లు పూర్తయిన త‌ర్వాత ఆర్సీబీ-సీఎస్కే జ‌ట్లు తొలి మ్యాచ్ లో భాగంగా త‌ల‌ప‌డ‌నున్నాయి. బెంగ‌ళూరు స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ చెన్నై లో దుమ్మురేప‌డానికి సిద్ధంగా ఉన్నాడు. పూర్తి కథనం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios