పెళ్లిపీటలు ఎక్కుతున్న బర్రెలక్క, ఘనంగా నిశ్చితార్థం... అబ్బాయి ఎవరంటే?
బర్రెలక్క అలియాస్ శిరీష పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మరి అబ్బాయి ఎవరంటే?
Barrelakka alias Karne Shirisha
సోషల్ మీడియా సెన్సేషన్ గా అవతరించింది బర్రెలక్క. ఈమె తన గ్రామంలో బర్రెలు కాచుకుంటూ వీడియోలు చేసేది. ఉద్యోగాలు లేవు. అందుకే నేను బర్రెలు మేపుకుంటున్నా అని శిరీష వీడియోలు చేసింది. అవి కాస్తా వైరల్ అయ్యాయి. దానితో ఆమె బర్రెలక్కగా పాప్యులర్ అయ్యింది.
Barrelakka
బర్రెలక్క గత ఏడాది జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. దాదాపు ఆరువేల ఓట్లు తెచ్చుకున్న బర్రెలక్క నాలుగో స్థానంలో నిలిచింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఆమె బరిలో దిగింది. బర్రెలక్క తరపున జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం చేయడం కొసమెరుపు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే బర్రెలక్క పెళ్ళికి సిద్ధమైంది. తన స్వగ్రామంలో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సడన్ గా నిశ్చితార్థం కుదరడం వలన ఎవరినీ పిలవలేకపోతున్నట్లు శిరీష వెల్లడించింది.
barrelakka shirisha
అయితే శిరీషకు కాబోయే వరుడు ఎవరు? అతని వివరాలు ఏమిటీ? అనేది తెలియరాలేదు. గట్స్ కలిగిన శిరీషను చేసుకునే అబ్బాయి అదృష్టవంతుడు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శిరీష బర్రెలు కాయడం లేదు. వాటిని అమ్మేసినట్లు సమాచారం.
ఆ మధ్య బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో శిరీష వివాహం అని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై శిరీష స్పందించింది. పల్లవి ప్రశాంత్ నాకు అన్నయ్యతో సమానం. తనతో నాకు పెళ్లి ఏంటని ఆమె ఒకింత ఆవేశం వ్యక్తం చేసింది. ఏదైతేనేమి బర్రెలక్క పెళ్లి చేసుకోనుంది.