టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. ఎంత మందికి చోటు దక్కిందంటే ?
ఏపీలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో లిస్టు విడుదల చేసింది. ఇందులో 11 అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి. ఇప్పటికే అధికార వైసీపీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. టీడీపీ కూడా ఇటీవల రెండు జాబితాల్లో తమ అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది.
మొత్తంగా 11 అసెంబ్లీ స్థానాలకు, 13 లోక్ సభ స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఖరారు చేశారు. ‘‘రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరాం. మరోవైపు పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ... రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నాం. పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులను... వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నాం. ప్రజలారా ఆశీర్వదించండి!’’ అంటూ ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదే..
1. పలాస - గౌతు శిరీష,
2. పాతపట్నం - గోవిందరావు
3. శ్రీకాకుళం - గొండు శంకర్
4. శృంగవరపుకోట - కోళ్ల లలితా కుమారి
5. కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వర రావు
6.అమలాపురం - అయితాబత్తుల ఆనంద రావు
7. పెనమలూరు - బోడె ప్రసాద్
8. మైలవరం - వసంత వెంకట కృష్ణ ప్రసాద్
9. నరసరావుపేట - డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు
10. చీరాల - మద్దలూరి మాలకొండయ్య యాదవ్
11.సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
లోక్ సభ అభ్యర్థులు వీరే..
1. శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్ నాయుడు
2. విశాఖపట్నం - మాత్కుమిల్లి భరత్
3. అమలాపూరం - గంటి హరీష్ మాధుర్
4. ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్
5. విజయవాడ - కేశినేని శివనాధ్ (చిన్ని)
6. గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్
7. నరసరావుపేట - లావు శ్రీకృష్ణ దేవరాయలు
8. బాపట్ల - టి. కృష్ణప్రసాద్
9. నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
10. చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ రావు
11. కర్నూలు - బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
12. నంద్యాల - బైరెడ్డి శబరి
13.హిందూపూర్ - బీకే. పార్థసారథి