ఇకపై అలంటి యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు: ఆండ్రాయిడ్ కొత్త అప్ డేట్..
గూగుల్ అన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌ను ప్రకటించడంతో ఆండ్రాయిడ్ 15కి సంబంధించిన వార్తలు ఇంకా పుకార్లు సోషల్ మీడియాను వైరల్ అయ్యాయి.
స్మార్ట్ ఫోన్‌లలో స్టోరేజీని మ్యానేజ్ చేసే కొత్త సిస్టమ్ త్వరలో రానున్నట్లు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్ 15 మే 14న వస్తుందని సమాచారం. అయితే ఈసారి లేటెస్ట్ అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లు ఇంకా డిజైన్ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. గూగుల్ అన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌ను ప్రకటించడంతో ఆండ్రాయిడ్ 15కి సంబంధించిన వార్తలు ఇంకా పుకార్లు సోషల్ మీడియాను వైరల్ అయ్యాయి.
వాటిలో ఒకటి ఆండ్రాయిడ్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో వస్తోంది. నివేదికల ప్రకారం, ఆండ్రాయిడ్ 15 OSలో మొబైల్ యాప్‌లను ఆర్కైవ్ చేసే సౌకర్యం ఉంటుంది. దీని వల్ల ఫోన్ స్టోరేజీ స్పెస్ సేవ్ చేయడమే దీని ప్రయోజనం. ఇది ఫోన్ పనితీరును మెరుగుపరచడంలోను సహాయపడుతుంది. చాలా ఫోన్‌లలో రెగ్యులర్‌గా ఉపయోగించని అనేక యాప్‌లు ఉంటాయి. వాటన్నింటికీ స్టోరేజ్ అవసరం. లిమిటెడ్ స్టోరేజ్ ఉన్న ఫోన్‌లో ఇది సమస్య కావచ్చు. యాప్‌లను పూర్తిగా అన్‌ఇన్‌స్టాల్ చేయకుండానే వాటిని ఆర్కైవ్ చేసి ఉంచేందుకు కొత్త సిస్టమ్ తోడ్పడుతుందని టెక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఆండ్రాయిడ్ 14 QPR3 బీటా 2 అప్‌డేట్‌లో ఈ ఫీచర్ వెనుక ఉన్న కోడ్ మిషాల్ రెహ్మాన్. రెహ్మాన్ ఆర్కైవ్ చేయడమే కాకుండా యాప్‌లను పునరుద్ధరించడానికి కూడా అప్షన్స్ కనుగొన్నారు. దీంతో ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని చర్చించారు. ఫోన్ స్టోరేజీని ఆదా చేయడమే కాకుండా, ఈ సిస్టమ్ డేటాను కూడా భద్రపరచగలదు.