ప్రధాని మోడీకి భూటాన్ అత్యున్నత పౌరపురస్కారం

భారత ప్రధాని భూటాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భూటాన్ రాజు ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారం డ్రూకో గ్యాల్పోతో భారత ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు.
 

bhutan king presents bhutan highest civilian honour award druk gyalpo to pm narendra modi kms

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. భూటాన్ రాజు ఆ దేశపు అత్యున్నత పురస్కారం డ్రూక్ గ్యాల్పోను ప్రధాని మోడీకి ప్రదానం చేశారు. 

ఆ దేశపు గౌరవ పురస్కారాలలో డ్రూక్ గ్యాల్పో అవార్డు అత్యున్నతమైనది. జీవిత సాఫల్య గౌరవంగా, అరుదైన గౌరవాన్ని అందించడానికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. భూటాన్ గౌరవ పురస్కారాల వరుసలో డ్రూప్ గ్యాల్పో అగ్రభాగాన ఉంటుంది.

ఈ అవార్డును ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని కేవలం నలుగురికి మాత్రమే ప్రదానం చేశారు. అందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకరు. మిగిలిన ముగ్గురూ భూటాన్ వాసులే. అంటే.. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న తొలి విదేశీయుడిగానూ భారత ప్రధాని రికార్డు సృష్టించారు.

ఈ అవార్డును గతంలో పొందిన వారు వీరు. రాణి అమ్మ ఆషి కేసంగ్ చోడెన్ వాంగ్చుక్‌కు 2008లో, జే త్రిజూర్ తెంజిన్ దెందుప్‌కు 2008లో, జే ఖెంపో త్రుల్కు గవాంగ్ జిగ్మే చోడ్రకు 2018లో ఈ అవార్డు దక్కింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios