Asianet News TeluguAsianet News Telugu

Today's Top Stories:  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల షార్ట్ లిస్ట్.. అందుబాటులోకి భారత్ రైస్.. సహజీవనానికి రిజిస్టర్

Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. హైకమండ్ కు షార్ట్ లిస్ట్ .., గ్రూప్‌ - 1పై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం, నన్ను టచ్ చేయడం రేవంత్ వల్ల కాదు: కేసీఆర్,  తెలంగాణ తల్లి విగ్రహం, అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, అందుబాటులోకి భారత్ రైస్, శరద్ పవార్‌కు షాక్..,చ‌రిత్ర సృష్టించిన భార‌త్.. 9వ సారి ఫైన‌ల్ కు.. ఇకపై  వీసా లేకుండా ఇరాన్‌కు, ఏపీ అసెంబ్లీలోగందరగోళం: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, సహజీవనానికి రిజిస్టర్ తప్పనిసరి.. లేదంటే ఆరు నెలల జైలు, జరిమానా.., లోక్ ‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మోడీ మార్క్ షాక్ .. యూపీఏ పాలనపై శ్వేతపత్రం వంటి వార్తల సమాహారం. 

Today top stories top 10 Telugu news Andhra Pradesh Telangana FEBRUARY 7th headlines krj
Author
First Published Feb 7, 2024, 7:02 AM IST

Today's Top Stories:    (పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల షార్ట్ లిస్ట్

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించి గెలుపు గుర్రాల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో 17 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 309 మంది నాయకులు అర్జీ పెట్టుకోగా.. నియోజకవర్గాల వారీగా ఇద్దరు లేదా ముగ్గురు ప్రధాన నేతలను పరిశీలన చేసి, అర్హులైన వారిని స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. ఈ లిస్ట్ ను పార్టీకి హైకమాండ్ కు పంపింది. 

TSPSC Group 1: గ్రూప్‌ - 1పై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

TSPSC Group 1: తెలంగాణ నిరుద్యోగలకు శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా అనుమతించిన 60 పోస్టుల్లో 24 డీఎస్పీ పోస్టులు, 19 MDO పోస్టులు, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో 4, ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో 3 డిప్యూటీ కలెక్టర్, పంచాయతీ రాజ్‌లో డిస్ట్రిక్ పంచాయతీ రాజ్ పోస్టులు -2 ఉన్నాయి. ఇక ఈ పోస్టుల భర్తీ కోసం వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని TSPSCకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

నన్ను టచ్ చేయడం రేవంత్ వల్ల కాదు: కేసీఆర్

తనను, బీఆర్ఎస్ పార్టీని టచ్ చేయడం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  వల్ల కాదని  భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పారు. మంగళవారంనాడు తెలంగాణ భవన్ లో  కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల్లోని బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్  సమావేశమయ్యారు. కేఆర్ఎంబీకి  ప్రాజెక్టులను  తెలంగాణ ప్రభుత్వం అప్పగించిందనే  ప్రచారంపై  ఆందోళనకు  బీఆర్ఎస్ పార్టీ సన్నాహలు చేస్తుంది.  

తెలంగాణ తల్లి విగ్రహం, అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయించడానికి గల కారణాలను సీఎం వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు వున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. 

అందుబాటులోకి భారత్ రైస్.. 


ఢిల్లీ : భారత్ రైస్ పేరుతో రూ. 29 రూపాయలకే కిలో బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంది భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం మంగళవారం అంటే ఫిబ్రవరి 6.. నేటి నుంచి ప్రారంభం కానుంది. రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్న సన్న బియ్యం ధరలతో  సామాన్యులు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీరికి ఊరట కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్.. మంగళవారం నాడు రూ.29కే కిలో భారత్ రైస్ అందించే కార్యక్రమాన్ని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ప్రారంభించనున్నారు.

శరద్ పవార్‌కు షాక్.. 


మరాఠా రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లోని తిరుగుబాటు గ్రూప్ అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ రెండుగా చీలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరిదనే దానిపై రెండు వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోపు తమ వర్గం పేరును, గుర్తును ఎన్నికల సంఘానికి తెలియజేయాలని గడువు విధించింది. 

 యూపీఏ పాలనపై శ్వేతపత్రం

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2004 నుంచి 2014 మధ్య దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగంపై మోదీ ప్రభుత్వం ‘శ్వేతపత్రం’ తీసుకురానుంది. ఈ కారణంగానే పార్లమెంటు సమావేశాలను ఒకరోజు పొడిగించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక దుర్వినియోగంపై శ్వేతపత్రం ద్వారా భారతదేశ ఆర్థిక దుస్థితి , ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను శ్వేతపత్రం వివరిస్తుంది. 

సహజీవనానికి రిజిస్టర్ తప్పనిసరి.. లేదంటే ఆరు నెలల జైలు, జరిమానా..

Uniform Civil Code : ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెట్టబడింది. ఇందులో ఇతర అంశాలతో పాటు, లివ్-ఇన్ రిలేషన్షిప్ లో పుట్టిన పిల్లలకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. ఇక యూనిఫాం సివిల్ కోడ్ చట్టంగా మారిన తర్వాత, ఉత్తరాఖండ్‌లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారంతా జిల్లా అధికారుల దగ్గర తమ బంధాన్ని నమోదు చేసుకోవాలి. వీరి వయసు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండి, లివ్ ఇన్ రిలేషన్ లో ఉండేవారికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.

నేడు ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు కీలక భేటీ..  

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చివరి ప్రయత్నంగా నేడు న్యూఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళ్లి బీజేపీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కాగా, బీజేపీ మాత్రం ఇంకా పిలుపునివ్వలేదు. 

ఏపీ అసెంబ్లీలోగందరగోళం: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

 
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి  మంగళవారం నాడు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.ధరల అంశంపై  తెలుగు దేశం పార్టీ  ఇవాళ  వాయిదా తీర్మానం ఇచ్చింది.ఈ విషయమై  చర్చకు  టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు  నిరసనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి  టీడీపీ ఎమ్మెల్యేలను  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం  సస్పెండ్ చేశారు.

గుడ్‌న్యూస్ : ఇకపై ఇరాన్‌కు వెళ్లాలంటే భారతీయులకు వీసా అక్కర్లేదు..  

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 4, 2024 నుండి భారత పౌరులకు వీసా నిబంధనలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న పౌరులు ప్రతి ఆరు నెలలకు  ఒకసారి 15 రోజుల పాటు ఎలాంటి వీసా లేకుండా ఇరాన్‌లోకి ప్రవేశించవచ్చని తెలిపింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న భారతీయ పౌరులు ఇకపై పర్యాటక ప్రయోజనాల కోసం ఇరాన్‌లోకి ప్రవేశించడానికి వీసా అవసరం లేదు. అయితే, ఇరాన్ అధికారులు తెలిపిన నిర్దిష్ట షరతులకు లోబడి భారతీయ పాస్‌పార్ట్ హోల్డర్స్ నడుచుకోవాల్సి వుంటుంది. 


U19 World Cup: చ‌రిత్ర సృష్టించిన భార‌త్..  

India U19 vs South Africa U19, Semi-Final: అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ సెమీ ఫైన‌ల్స్ లో సౌతాఫ్రికాను భార‌త్ జ‌ట్టు చిత్తు చేసింది. సౌతాఫ్రికాపై గెలుపుతో యంగ్ ఇండియా 9వ సారి అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఫైనల్ చేరి స‌రికొత్త రికార్డు సృష్టించింది. విల్లోమూర్ పార్క్, బెనోని వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios