Asianet News TeluguAsianet News Telugu

TSPSC Group 1: గ్రూప్‌ - 1పై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

TSPSC Group 1: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ - 1 కేటగిరిలో మరో 60 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన  ప్రభుత్వం తాజాగా మరో 60 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో  మొ్త్తం పోస్టుల సంఖ్య 563కి పెరిగింది.

Telangana government issues notification for TSPSC Group 1 jobs KRJ
Author
First Published Feb 7, 2024, 4:39 AM IST | Last Updated Feb 7, 2024, 4:39 AM IST

TSPSC Group 1: తెలంగాణ నిరుద్యోగలకు శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా అనుమతించిన 60 పోస్టుల్లో 24 డీఎస్పీ పోస్టులు, 19 MDO పోస్టులు, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో 4, ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో 3 డిప్యూటీ కలెక్టర్, పంచాయతీ రాజ్‌లో డిస్ట్రిక్ పంచాయతీ రాజ్ పోస్టులు -2 ఉన్నాయి. ఇక ఈ పోస్టుల భర్తీ కోసం వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని TSPSCకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

ఇప్పటికే రెండుసార్లు రద్దయిన తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. కాగా.. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 2,80,000 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా తరువాత పేపర్ లీకేజ్ అయినట్టు తెలింది. 

దీంతో ఆ పరీక్షను రద్దు చేశారు. దీంతో ఈ పరీక్షను 2023 జూన్‌లో మళ్లీ నిర్వహించారు. దీంతో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షల నిర్వహణలో పలు లోపాలున్నాయని ఆరోపించారు.  నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కానీ.. కోర్టులో ఇంత వరకు వాదనలు జరుగలేదు.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.

రేవంత్ రెడ్డి సీఎం గా అధికారం చేపట్టగానే గ్రూప్‌ 1 పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పోస్టులు కలిపి రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. 60 పోస్టులను అదనంగా చేరుస్తూ సుమారు 563 పోస్టులకు కలుపుతు త్వరలో రీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios