Asianet News TeluguAsianet News Telugu

Today's Top Stories: త్వరలో రూ.500కే గ్యాస్!.. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. ముదురుతోన్న 'శ్రీమంతుడు' వివాదం

Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  తెలంగాణ కేబినెట్ భేటీ ముహూర్తం ఫిక్స్..!,  తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే..? , బీఆర్ఎస్ నేతలకు రేవంత్ వార్నింగ్,  త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్, లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ వ్యూహాలు, ట్రక్కు డ్రైవర్లకు మోడీ శుభవార్త .., దమ్ముంటే వారణాసిలో మోడీని ఓడించండి: మమతా బెనర్జీ , దూకుడు పెంచిన బీజేపీ.. టీడీపీ-జనసేనతో దూరమేనా?, ఉదయనిధి స్టాలిన్‌కు కర్ణాటక కోర్టు సమన్లు, పొలిటికల్ పార్టీని స్థాపించిన విజయ్ దళపతి..,  జార్ఖండ్ కొత్త సీఎం: చంపా సోరెన్ ప్రమాణం, ముదురుతున్న శ్రీమంతుడు` సినిమా స్టోరీ కాపీ వివాదం, ప్రముఖ నటి పూనమ్ పాండే మృతి !,  భారీస్కోర్ దిశగా టీమిండియా.. రాణించిన యశస్వి జైస్వాల్ వంటి వార్తల సమాహారం. 

today top stories top 10 Telugu news Andhra Pradesh Telangana FEBRUARY 3rd headlines krj
Author
First Published Feb 3, 2024, 7:35 AM IST

( నోట్: పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)

Today's Top Stories: తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్..! 

Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా ఆరు గ్యారెంటీల్లోని మరో రెండు పథకాల  అమలు, బడ్జెట్ సమావేశాల అజెండాగా చర్చ జరగనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మరో రెండు పథకాల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

 తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే..?  

ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం వుంది. ఫిబ్రవరి 8న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిపే అవకాశం వుంది. ఫిబ్రవరి 10న ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

బీఆర్ఎస్ నేతలకు రేవంత్ వార్నింగ్


కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అంటూ తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  శుక్రవారం ఇంద్రవెల్లిలో జరిగిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్లు ఈ ప్రభుత్వం కూలుతుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతామని రేవంత్ హెచ్చరించారు. 6 నుంచి 7 ఎంపీ సీట్లు వస్తే మళ్లీ మోడీకి అమ్ముకుంటారా అని సీఎం ప్రశ్నించారు. 

త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్

మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం ఇంద్రవెల్లి సమీపంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. త్వరలోనే మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, విద్యార్ధుల యూనిఫాంలు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే అప్పగిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  


లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ వ్యూహాలు
 

లోక్ సభ ఎన్నికలలో గతంలో కంటే ఎక్కువ సీట్లు సంపాదించాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికికి ఢోకా లేదనే సంకేతాలను బలంగా ప్రజలకు ఇవ్వాలని గులాబీ దళం ఆలోచిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే పార్లమెంటరీ స్థాయిలో నేతలతో సమీక్షలు చేపట్టింది. మొత్తంగా లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కొన్ని స్పష్టమైన టార్గెట్లు ఉన్నాయి.  రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ మూడోసారి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో క్యాడర్ కొంత ఢీలా పడింది. అందుకే లోక్ సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించి రాష్ట్రంలో తమ ఉనికి ఎప్పటిలాగే బలంగా ఉన్నదని చాటడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది.

ట్రక్కు డ్రైవర్లకు మోడీ శుభవార్త ..

దేశంలోని ట్రక్ , లారీ డ్రైవర్లకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో పాల్గొన్న మోడీ ప్రసంగిస్తూ.. ఆటోమోటివ్ ఎకోసిస్టమ్‌లో డ్రైవర్ల ప్రాముఖ్యత గురించి ప్రస్తావించిన ప్రధాని..డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి త్వరలో 1000 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. భోజనం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి పార్కింగ్ సదుపాయాలు వుండేలా ఈ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తామన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు. 

దమ్ముంటే వారణాసిలో మోడీని ఓడించండి: మమతా బెనర్జీ  
 
INDIA Alliance: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ 300 సీట్లల్లో పోటీ చేస్తే కనీసం 40 సీట్లు గెలుస్తుందా? అన్నది అనుమానమే. అలాంటప్పుడు ఎందుకు అంత అహంకారం? మీరు బెంగాల్‌కు వచ్చారు. మనం ఇండియా కూటమిలో మిత్రపక్షాలం. బెంగాల్‌కు వచ్చినప్పుడు కనీసం నాకు సమాచారం ఇవ్వాలి కదా. అధికారుల నుంచి నాకు ఆ విషయం తెలిసింది. మీకు నిజంగా దమ్ముంటే బీజేపీని వారణాసి స్థానంలో ఓడించండి. గతంలో మీరు గెలిచిన స్థానాల్లో ఓడిపోయారు’ అని మమతా బెనర్జీ అన్నారు.

దూకుడు పెంచిన బీజేపీ.. టీడీపీ-జనసేనతో దూరమేనా?

 ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు చురుకుగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నాయకుల చేరికలు, అభ్యర్థుల ప్రకటనలపై పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. అధికార వైసీపీ ఇది వరకే అభ్యర్థుల ప్రకటనలు చేస్తున్నది. ఇటీవలే ఐదో జాబితా విడుదల చేసింది. ప్రతిపక్షాలది ప్రత్యేక పరిస్థితిగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే గ్రౌండ్ తయారు చేసుకుంటూ ఉంటే.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేనల పొత్తు బీజేపీ కారణంగా పెండింగ్‌లో పడింది. ఇంతకీ బీజేపీ వైఖరి ఏమటనేది తెలియక ఉభయ పార్టీల అధినేతలు, ఆశావహులు టెన్షన్‌లో ఉన్నారు. కానీ, ఏపీ బీజేపీ మాత్రం అనూహ్యంగా వేగం పెంచింది. పార్టీని విస్తరించడానికి, ప్రచారానికి సొంతంగా లెక్కలు వేసుకుంటున్నది. దీంతో టీడీపీ, జనసేనల్లో గందరగోళం మొదలైంది.

ఉదయనిధి స్టాలిన్‌కు కర్ణాటక కోర్టు సమన్లు


తమిళనాడు క్రీడా శాఖ మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు కర్ణాటక కోర్టు సమన్లు పంపింది. మార్చి 4వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. గతేడాది ఆయన సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఈ సమన్లు పంపింది.

పొలిటికల్ పార్టీని స్థాపించిన విజయ్ దళపతి..  

తమిళ నటుడు విజయ్ దళపతి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కొంత కాలంగా వస్తున్న వార్తలను ఆయన నిజం చేశారు. విజయ్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. దానికి ‘తమిజగ వెట్రి కజగం’ అనే పేరు పెట్టారు. ఆ పేరును తాజాగా ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ లో తాజాగా రిజిస్ట్రేషన్ చేయించారు. 

జార్ఖండ్ కొత్త సీఎం: చంపా సోరెన్ ప్రమాణం

న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా  చంపా సోరేన్ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు.  రెండు రోజుల క్రితం  హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో  హేమంత్ సోరేన్ స్థానంలో  జేఎంఎం శాసనసభ్యులు  చంపా సోరేన్ ను తమ పార్టీ శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు.ఈ విషయమై ఎమ్మెల్యేల సంతకాలతో  గవర్నర్ కు  చంపై సోరేన్ లేఖ అందించారు.  ఇవాళ  కొత్త సీఎంగా  చంపా సోరేన్ తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. పది రోజుల్లోపుగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్   సీఎం చంపా సోరేన్ ను ఆదేశించారు.

శ్రీమంతుడు` సినిమా స్టోరీ కాపీ వివాదం

మహేష్‌ బాబు నటించిన `శ్రీమంతుడు` మూవీ కాపీ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఇది కోర్ట్ లో ఉన్న నేపథ్యంలో ఇటు శరత్‌ చంద్ర, అటు సినిమా టీమ్‌ ఆచితూచి వ్యవహరిస్తుంది. అయితే ఇది తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆ మధ్య దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, జైలుకి వెళ్లాల్సి వస్తుందని కోర్ట్ చెప్పింది. మరోవైపు `చచ్చేంత నవల` రచయిత శరత్‌ చంద్ర మాత్రం తాను మహేష్‌ బాబుపై కూడా కేసు వేస్తానని హెచ్చరిస్తున్నాడు. 

ప్రముఖ నటి పూనమ్ పాండే మృతి !


నటి పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో మరణించినట్లు ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా శుక్రవారం షేర్ చేసింది. అందులో ఇలా రాశారు.. "ఈ ఉదయం చాలా దురదృష్టకరమైనది. మా ప్రియమైన పూనమ్‌ను గర్భాశయ క్యాన్సర్‌తో కోల్పోయాం. ఈ విషయం మీకు తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాం. ఆమెతో పరిచయం ఉన్న ప్రతీ వ్యక్తికి, జీవికి ఆమె స్వచ్ఛమైన ప్రేమ, దయ గురించి తెలుసే ఉంటుంది. ఈ వార్త చాలా దు:ఖ సమయం. మమ్మల్ని కాస్త ఒంటరిగా వదిలేయమని కోరుకుంటున్నాం" అని తెలిపారు. 

 భారీస్కోర్ దిశగా టీమిండియా.. రాణించిన యశస్వి జైస్వాల్ 

IND vs ENG: విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీస్కోర్ సాధించింది. ఆ మ్యాచ్ లో యువ బ్యాట్స్ మెన్ యశస్వీ జైస్వాల్ తన ఆటతీరుతో అభిమానులను కట్టిపడేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈక్రమంలో శతకాన్ని నమోదు చేశారు. మొత్తానికి టీమిండియా భారీ స్కోర్ చేసింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios