Asianet News TeluguAsianet News Telugu

Thalapathy Vijay: పవన్ కళ్యాణ్, విజయ్‌లది ఒకే దారి!.. సేమ్ టు సేమ్!!

పవన్ కళ్యాణ్‌ది సినిమాలైనా.. పాలిటిక్స్ అయినా.. ఒక డిఫరెంట్ రూట్. అభిమానులే ఇరుసుగా ఆయన స్థాపించిన జనసేన పార్టీ ముందుకు దూసుకుపోతున్నది. విజయ్‌ది కూడా ఇదే దారి. ఆయన రాజకీయంలోకి రాకముందే ఆయన అభిమానులు ఒక పార్టీగా ఏర్పడి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపించారు. ఇప్పుడు విజయ్ పార్టీకి కూడా అభిమానులే ఇంధనం.
 

thalapathy vijay enters into politics, many compares him with pawan kalyan who established janasena party kms
Author
First Published Feb 2, 2024, 3:25 PM IST | Last Updated Feb 2, 2024, 4:22 PM IST

Pawan Kalyan: తమిళ సినీ పరిశ్రమ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ చేశారు. ఆయన తమిళగ వెట్రి కళగం పేరిట ఆయన పార్టీని ఎన్నికల సంఘం రిజిస్టర్ చేసింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాగే, ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని విజయ్ స్పష్టం చేశారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలుస్తామని చెప్పారు. అవినీతి, విభజన రాజకీయాలు ప్రజల మధ్య ఐక్యత, ప్రగతికి అవరోధాలుగా నిలుస్తాయని, సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు కేవలం రాజకీయ అధికారంతోనే సాధ్యం అవుతాయని విజయ్ అన్నారు. దీంతో తమిళనాట మరో రాజకీయ పార్టీ ప్రవేశించినట్టయింది.  ఈ పార్టీ భావజాలాన్ని సూత్రప్రాయంగా విజయ్ వెల్లడించారు. తమిళనాడులో ద్రావిడియన్ ఐడియాలజీనే ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. 

ఇప్పటికే ఇద్దరు హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్ పవన్ కళ్యాణ్ అని, తమిళనాడుకు దళపతి విజయ్ భవిష్యత్‌ అని కామెంట్లు చేసుకుంటున్నారు.

అయితే, విజయ్ పొలిటికల్ ఎంట్రీని పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పోలుస్తున్నారు. ఈ ఉభయ హీరోల మధ్య పోలికలు తీస్తున్నారు. వీరిద్దరికీ అభిమానులు అధికంగా ఉంటారు. యాక్టింగ్, ప్రత్యేకమైన మ్యానరిజం, స్టైల్‌తో వీరు తమను తాము ఒక కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వీరు మ్యానరిజంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు.

2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కానీ, అప్పుడే వచ్చిన లోక్ సభ ఎన్నికల్లోగానీ, అసెంబ్లీ ఎన్నికల్లోగానీ పోటీ చేయలేదు. జనసేనకు బలం పవన్ కళ్యాణ్ అభిమానులే. ఆయన ఏ కార్యక్రమానికి వెళ్లినా.. అది సినిమా ఈవెంట్ అయినా.. పొలిటికల్ ప్రోగ్రామ్ అయినా.. అభిమానులు దాన్ని సక్సెస్ చేసి తీరుతుంటారు. జనసేన పార్టీ అభిమానులే ఇరుసుగా ముందుకు సాగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆశించిన ఫలితాలు రాకున్నా.. ఈ సారి మాత్రం ఫలితాలపై ఆశలు పెంచుకుంది. 

Also Read: KCR: లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ వ్యూహాలు.. గులాబీ దళం టార్గెట్ ఇదే

జనసేన స్థాపించిన పదేళ్ల తర్వాత తమిళనాట దళపతి విజయ్ పార్టీని స్థాపించారు. ఆయన కూడా ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. విజయ్‌కు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అధికారికంగానే ఆయనకు పది లక్షల వరకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నది. నిజానికి విజయ్ అధికారంలోకి రాకమునుపే అభిమానులు ఒక పార్టీగా ఏర్పడి స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారు. 169 సీట్లల్లో పోటీ చేసి 115 సీట్లు కూడా వీరు గెలుచుకున్నారు. ఇది కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం కన్నా సూపర్ ట్రాక్ రికార్డు. మరి ఇప్పుడు దళపతి విజయ్ కొత్తగా పార్టీ పెట్టి పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఆ పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడటానికి మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే. 2026 ఏప్రిల్-మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ సుమారు పది తెలుగు సినిమాలను రిమేక్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ బద్రి సినిమా కూడా ఉన్నది. తమిళంలోనూ ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios