KCR: లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ వ్యూహాలు.. గులాబీ దళం టార్గెట్ ఇదే

లోక్ సభ ఎన్నికలలో గతంలో కంటే ఎక్కువ సీట్లు సంపాదించాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికికి ఢోకా లేదనే సంకేతాలను బలంగా ప్రజలకు ఇవ్వాలని గులాబీ దళం ఆలోచిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే పార్లమెంటరీ స్థాయిలో నేతలతో సమీక్షలు చేపట్టింది. మొత్తంగా లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కొన్ని స్పష్టమైన టార్గెట్లు ఉన్నాయి.
 

brs chief, ex cm k chandrashekar rao target for lok sabha elections in telangana kms

BRS Party: తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్‌కు రాష్ట్రంలో గట్టి పట్టు ఉన్నది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ మూడోసారి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో క్యాడర్ కొంత ఢీలా పడింది. అందుకే లోక్ సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించి రాష్ట్రంలో తమ ఉనికి ఎప్పటిలాగే బలంగా ఉన్నదని చాటడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది.

2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను 9 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. బీజేపీ నాలుగు స్థానాలు, కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకుంది. ఎంఐఎం ఒక సీటు కైవసం చేసుకుంది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్‌కు ఉన్నది. అందుకే 17 సీట్లలో 12 నుంచి 14 ఎంపీ సీట్లను గెలుచుకోవాలనే కాంగ్రెస్ నేతలు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇక బీజేపీ గతంలో నాలుగు సీట్లే గెలుచుకున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు షేర్ గణనీయంగా పెంచుకోవడంతో కమలం నాయకులు లోక్ సభ ఎన్నికల టార్గెట్ పెంచుకున్నారు. ఏకంగా డబుల్ డిజిట్ అందుకోవాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఎంఐఎం పార్టీ మాత్రం హైదరాబాద్ సీటు తమదేననే ధీమాలో ఉన్నది.

టార్గెట్ డబుల్ డిజిట్:

బీఆర్ఎస్ పరిస్థితులు రివర్స్ అయ్యాయి. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు గెలుచుకున్నా.. ఎంపీ స్థానాల్లో డబుల్ డిజిట్ అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు గులాబీ పార్టీ 39 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుని.. డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను అందుకోగలదా? అనే సంశయాలు ఉన్నాయి.

అయితే, పార్టీని బలోపేతం చేయడానికి, క్యాడర్‌కు, ప్రజలకూ బలమైన సంకేతాలు ఇవ్వాలంటే బీఆర్ఎస్ కచ్చితంగా ఈ ఎన్నికల్లో తన ఆధిక్యాన్ని చూపించుకోవాల్సిందే. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలూ వ్యూహాలు రచిస్తున్నారు. గత నెల వరుసగా పార్లమెంటరీ స్థానాల్లో పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహించారు. ఈ సారి గతంలో కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోయాయని బీఆర్ఎస్ నేతలకు తెలియనిది కాదు. కష్టపడితే నాలుగు నుంచి ఐదు ఎంపీ సీట్లు అయినా దక్కవా? అనే మీమాంసలో ఉన్నట్టు తెలుస్తున్నది. 

బీజేపీ, కాంగ్రెస్ చీఫ్‌ల సీట్లపై కన్ను:

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు జీహెచ్ఎంసీలో అధికంగా సీట్లు వచ్చాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఆశావహులు మల్కజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల సీట్ల కోసం తెగ పోటీ పడుతున్నారు. మల్కజ్‌గిరి, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల పరిధిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో 13 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ కొంచెం కష్టపడితే ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోగలదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. అయితే, ఈ రెండు స్థానాలకూ ప్రత్యర్థి పార్టీల సారథులు గెలిచిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్రమంత్రిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచి సీఎంగా ప్రమాణం చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన సంగతతీ విధితమే.

ఇక చేవెళ్ల నుంచి సిట్టింగ్  ఎంపీ రంజిత్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios