Asianet News TeluguAsianet News Telugu

త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ .. మహిళలకు తీపికబురు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలోనే మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, విద్యార్ధుల యూనిఫాంలు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే అప్పగిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

telangana cm revanth reddy key announcement on gas cylinder for rs 500 ksp
Author
First Published Feb 2, 2024, 4:57 PM IST | Last Updated Feb 2, 2024, 4:58 PM IST

మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం ఇంద్రవెల్లి సమీపంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. సమావేశంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు రూ.60 కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారని తెలిపారు. త్వరలోనే మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, విద్యార్ధుల యూనిఫాంలు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే అప్పగిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని ఆయన దుయ్యబట్టారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios