బెంగుళూరు: కర్ణాటక సీఎం కుమారస్వామి తాజ్ హోటల్‌లో ఓ రూమ్‌ను తన అదృష్ట గదిగా భావిస్తారు. ఆ గదిలో ఉన్న సమయంలోనే తనకు సీఎం పదవి దక్కిందని కుమారస్వామి గుర్తు చేసుకొన్నారు.

కర్ణాటక సీఎం కుమారస్వామికి కొన్ని విషయాలను పిచ్చిగా నమ్ముతారు. జ్యోతిష్యుల సూచన మేరకు ఇల్లు మారడంతో కుమారస్వామికి మరోసారి సీఎం పదవిని దక్కించుకొన్నట్టుగా ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పారని ప్రచారంలో ఉంది.

2018 ఎన్నికల ఫలితాలను జేడీ(ఎస్) చీఫ్  కుమారస్వామి బెంగుళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్  హోటల్ లో ఉండి టీవీల్లో వీక్షిస్తుండగా సీఎం పదవి దక్కిందని ఆయన గుర్తు చేసుకొన్నారు.అందుకే తాను ఇదే హోటల్ రూమ్‌లో ఉన్నట్టుగా కుమారస్వామి మంగళవారం నాడు అసెంబ్లీలో ప్రకటించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్న సమయంలో  కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్  తనకు ఫోన్ చేసి  సీఎం పదవిని ఆపర్ చేశారని ఆయన గుర్తు చేసుకొన్నారు. జేడీ(ఎస్)కు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని ఆజాద్ తనకు ఫోన్ లో చెప్పారని ఆయన ప్రస్తావించారు.

అందుకే ఆ రూమ్ ను తాను అదృష్ట వరించిన రూమ్ గా బావిస్తానని కుమారస్వామి చెప్పారు. ఈ రూమ్ ను అలాగే ఉంచుకొన్నానని కుమారస్వామి ప్రకటించారు.

 

 

కర్ణాటక అసెంబ్లీ లైవ్ : సోనియాగాంధీ కోరితేనే సీఎం అయ్యానన్న కుమారస్వామి

కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)

కర్ణాటక క్రైసిస్: ఇద్దరు ఎమ్మెల్యేల కోసం బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

కర్ణాటక సంక్షోభం: బెంగళూరులో 144వ సెక్షన్, వైన్ షాపులు బంద్

కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు

బీజేపీలా కొనుగోలు చేయలేదు, మావాళ్లే వెన్నుపోటు పొడిచారు: కుమారస్వామి