పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.... ఢిల్లీలోని షహీన్ బాగ్ లో నిరసనకారులు నిరవధికంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై సుప్రీమ్ కోర్టులో దాఖలైన పిటిషన్ పై సుప్రీమ్ కోర్ట్ నేడు విచారణ చేపట్టింది. 

దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఈ నిరసనలను అక్కడి నుంచి తొలగించాలని, ప్రయాణానికి కలుగుతున్న ఇబ్బందులను తగ్గించాలని సుప్రీమ్ కోర్టులో దాఖలైన పిటిషన్లను సుప్రీమ్ విచారణకు స్వీకరించింది. 

గత సోమవారమే ఇందుకు సంబంధించి రెండు పిటిషన్లు సుప్రీమ్ కోర్టులో దాఖలయ్యాయి. వాటిని నేడు సుప్రీమ్ విచారణకు స్వీకరించింది. నిరసన తెలపడాన్ని తప్పుబట్టట్లేదని చెబుతూనే... ట్రాఫిక్ కి అంతరాయం కలిగించదాన్ని మాత్రం తప్పుబట్టింది. 

Also read: పబ్లిక్ రోడ్డును బ్లాక్ చేస్తారా: షాహీన్‌బాగ్ నిరసనలపై సుప్రీం సీరియస్

నిరసన తెలపడం తప్ప ఒప్పా అనే విషయంపై తాము విచారించబోవడం లేదని, నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని తాము దాని జోలికి వెల్లబోవడం లేదని కోర్ట్ తెలిపింది. 

కేవలం ఇలా పబ్లిక్ ప్రాపర్టీ అయినా రోడ్లపైన నిరసన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మాత్రమే తాము తమ పరిగణలోకి తీసుకొని ఈ విచారణ నిర్వహిస్తున్నామని కోర్టు తెలిపింది. 

సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డేను కోర్టు మధ్యవర్తిగా నియమించింది. షహీన్ బాగ్ నిరసనకారులతో మాట్లాడవలిసిందిగా, వారికీ కోర్టుకు మధ్య మధ్యవర్తిగా సంజయ్ హెగ్డే వ్యవహరించనున్నాడు. 

షహీన్ బాగ్ లో కొనసాగుతున్న నిరసనల్లో ఇప్పటికే అక్కడున్న నిరసనకారుల మధ్య గ్రూపులు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే అమిత్ షా తాను షహీన్ బాగ్ నిరసనకారుల వాయిస్ వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పగానే ఒక వర్గం అమిత్ షా ను కలుస్తామని రల్ల్య్ గా బయల్దేరు. 

ఇంకోప్ వర్గమేమో అమిత్ శని ఇక్కడికి రావాలని కోరారు. ఈ తరుణంలో సంజయ్ హెగ్డేకు ఇలా మధ్యవర్తిత్వం చేయడం అంత తేలికైనపనికాదు. వారికి వేరే చోట నిరసనలు తెలపడానికి ఆస్కారం ఇస్తామని చెప్పినా వారు వినడానికి సిద్ధంగా లేరు. దానికి కారణం కూడా లేకపోలేదు. 

తమ సొంత ఇలాఖాలో నిరసనలు చేస్తుంటే... కొందరు తుపాకులు పట్టుకొని తమను బెదిరించాడు వస్తుంటే... బయటయితే తమకు భద్రత ఉండదని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సంజయ్ హెగ్డే ఎలా మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఇది అంత వీజీకాదు.