Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర న్యాయ శాఖమంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం.. ‘కొలీజియంపై అలా వ్యాఖ్యానించకుండా ఉండాల్సింది’

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు టీవీలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. కొలీజియం వ్యవస్థపై కిరణ్ రిజిజు ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదని పేర్కొంది. కొలీజియం వ్యవస్థ పై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
 

supreme court objects law minister kiren rijijus comment on collegium
Author
First Published Nov 28, 2022, 3:59 PM IST

న్యూఢిల్లీ: న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పలుమార్లు కొలీజియం పై అసహనాన్ని వ్యక్తపరిచారు. తాజాగా, ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ రాజ్యాంగానికి వెలుపలి వ్యవస్థ ఇది అని ఆరోపణలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కొలీజియం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అలా వ్యాఖ్యానించకుండా ఉండాల్సిందని పేర్కొంది. అంతేకాదు, న్యాయమూర్తుల నియమాకాలపై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆ నియామకాలపై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలను వ్యక్తం చేయకుండా సిఫార్సు చేసిన పేర్లపై ఆమోముద్ర వేయకుండా జాప్యం చేయజాలదని తెలిపింది. రాజ్యాంగాన్ని, దాని మౌలిక స్వభావాన్ని రక్షించే వ్యవస్థగా జ్యుడీషియరీ ఉంటుందని పలువురు న్యాయమూర్తులు పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరించాల్సి ఉండటంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు చాలా సార్లు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా, ఆయన కొలీజియం వ్యవస్థపై దాడి చేస్తూ ఇది రాజ్యాంగానికి వెలుపలి వ్యవస్థ అని అన్నారు. సుప్రీంకోర్టు తమ ఆలోచనలకు అనుగుణంగా ఓ కోర్టు తీర్పుతో కొలీజియం వ్యవస్థను సృష్టించిందని ఆరోపించారు. 1991కి ముందు న్యాయమూర్తులు అందరినీ ప్రభుత్వమే నియమించేదని తెలిపారు.

Also Read: న్యాయ శాఖ మంత్రి సమక్షంలో కొలీజియంపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు.. ‘వారు భయపడుతున్నారు’

ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఏఎస్ ఓకాల ధర్మాసనం సీరియస్‌గా స్పందించింది. ‘మిస్టర్ అటార్నీ జనరల్, నేను అన్ని ప్రెస్ రిపోర్టులను పట్టించుకోలేదు. కానీ, ఇది ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఓ ఇంటర్వ్యూలో వచ్చింది. నేను దీనిపై మరేమీ అనట్లేదు. మేం అందుకు పూనుకోవాలనుకుంటే.. నిర్ణయమే తీసుకుంటాం’ అని అటార్నీ జనరల్ ఆర్ వెంకట్‌రమణితో జస్టిస్ కౌల్ అన్నారు. ‘ఈ విషయాన్ని పరిష్కరించండి. ఈ విషయమై జ్యూడీషియల్ నిర్ణయం తీసుకునేలా మమ్మల్ని చేయవద్దు’ అని ధర్మాసనం పేర్కొంది.

కేంద్రం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ కొన్నిసార్లు మీడియా రిపోర్టులు తప్పుగా ఉంటాయని అన్నారు.

టైమ్స్ నౌ సమ్మిట్‌లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, రాజ్యాంగం అంటే భారతీయులందరికీ ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక మత గ్రంథం అని అన్నారు. రాజ్యాంగానికి వెలుపల ఏ కోర్టు అయినా, కొందరు న్యాయమూర్తులైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని దేశం ఆమోదించాలని మీరెలా ఊహిస్తారు? అంటూ కామెంట్ చేశారు.

అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌లను ఉద్దేశిస్తూ కోర్టు న్యాయమూర్తుల ఎంపిక ప్రతిపాదనలపై ఆమోదం తెలుపకపోవడంపై మాట్లాడింది. ‘క్షేత్రస్థాయిలో జరిగే నిజం ఏమిటంటే? న్యాయమూర్తుల పేర్లు క్లియర్ చేయడం లేదు. అలాంటప్పుడు వ్యవస్థ ఎలా పని చేస్తుంది? కొన్ని పేర్లయితే ఏడాదిన్నర కాలం నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

Also Read: కొలీజియం నియామకాల వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది - కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు

‘మీరు పేర్లు పెండింగ్‌లో ఉంచడం కూడదు. ఇది మొత్తం వ్యవస్థనే ఒత్తిడిలోకి నెడుతుంది. కొన్ని సార్లు మీరు అపాయింట్ చేసినప్పుడు జాబితాలో నుంచి కొందరి పేర్లు ఎంచుకని మిగతా వాటి పేర్లను క్లియర్ చేయడం లేదు. ఇది కచ్చితంగా సీనియారిటీని డిస్టర్బ్ చేస్తున్నది’ అని తెలిపింది.

సుప్రీంకోర్టు చేసిన సిఫార్సులను నాలుగు నెలలుగా పెండింగ్‌లో పెట్టారని, ఇది కాల వ్యవధిని దాటేసిందని పేర్కొంది. టైమ్‌లైన్స్ పాటించాలని సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios