Asianet News TeluguAsianet News Telugu

కొలీజియం నియామకాల వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది - కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు

న్యాయవ్యవస్థలో నియామక ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజజు అన్నారు. దీని కోసం కొలీజియం నియామకాల వ్యవస్థపై మళ్లీ ఆలోచించాలని తెలిపారు. 

Collegium appointment system needs rethinking - Union Law Minister Kiran Rijiju
Author
First Published Sep 18, 2022, 1:28 PM IST

ప్రస్తుత ప్రక్రియపై ఆందోళనలు ఉన్నందున ఉన్నత న్యాయవ్యవస్థలో నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి కొలీజియం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయ‌ప‌డ్డారు. అత్యున్నత న్యాయవ్యవస్థలో నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. అయితే దీనికి న్యాయ శాఖ మంత్రి కార‌ణం కార‌ని, నియామకాల వ్య‌వ‌స్థ వ‌ల్లే ఇలా జ‌రుగుతోంద‌ని చెప్పారు. 

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ‘ఎమర్జింగ్ లీగల్ ఇష్యూస్-2022’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే యూనియన్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ (వెస్ట్ జోన్) కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయ‌న హాజ‌రై మాట్లాడారు. ఉన్నత న్యాయవ్యవస్థలో నియామకాలు వేగవంతం కావాలంటే కొలీజియం వ్యవస్థ అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా రిజ‌ర్వేషన్లు క‌ల్పించ‌డం ఉత్త‌ర భారతానికి, పార్లమెంట్ కు ఇష్టం లేదు - శరద్ పవార్

అనంతరం ఆయన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతం ఉన్న వ్యవస్థ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విష‌యం ప్ర‌తి ఒక్కరికీ తెలుసు. ఏం చేయాలి ? ఎలా చేయాలి అనే విష‌యంలో త‌దుప‌రి చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, ఆహ్వానితులు ముందు నా నా అభిప్రాయాలను ఉంచాను. ’’ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అన్నారు. 

ఈ వ‌ర్క్ షాప్ లో తాను ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తే న్యాయశాఖ మంత్రి మనసులో ఏముందో, ప్రభుత్వం ఏమనుకుంటున్నారో ప్ర‌జ‌లంద‌రూ తెలుసుకుంటారని రిజిజు అన్నారు. త‌న అభిప్రాయ‌ల‌ను వ్య‌క్త‌ప‌ర్చాన‌ని, అంద‌రి అభిప్రాయాల‌ను కూడా విన్నాన‌ని చెప్పారు. రాజస్థాన్ హైకోర్టులో అనేక నియామకాలు జరగాల్సి ఉందని, అవి పెండింగ్‌లో ఉన్నందున తాను ఉదయపూర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ఆయన అన్నారు.

పంజాబ్ లో 60 మంది విద్యార్ధినుల నగ్న వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్: బాధితుల ఆందోళన

భారత ప్రభుత్వానికి సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా అన్ని హైకోర్టుల్లో అదనపు సొలిసిటర్ జనరల్‌లను నియమిస్తామని రిజిజు శనివారం తెలిపారు. దేశంలోని న్యాయస్థానాలను డిజిటలైజ్ చేస్తున్నామని, దీనివల్ల ప్రజలు తమ కేసులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు దోహదపడుతుందన్నారు. హైకోర్టులు, దిగువ కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 

లా అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  దేశంలో 4.85 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ పెండింగ్‌ను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంత‌రం ప్రత్యేక అతిథిగా హాజరైన కేంద్ర న్యాయ, న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్‌పి బఘెల్ మాట్లాడుతూ.. ఈ సదస్సులో మేధోమథనం ఉంటుందని, ప్రజాస్వామ్యం, దాని సంస్థలను బలోపేతం చేయడంపై నిర్దిష్టమైన నిర్ణయాలు వెలువడుతాయని అన్నారు.

లోన్ రికవరీ ఏజెంట్ అమానవీయ చర్య.. ట్రాక్టర్ చక్రాల కింద నలిగి చనిపోయిన గర్భిణి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి, రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎంఎం శ్రీవాస్తవ, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా కూడా ఈ వర్క్ షాప్ ప్రారంభోత్సవంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఉన్నత న్యాయవ్యవస్థలో నియామకాల కోసం కొలీజియం సూచించిన పేర్లను ప్రభుత్వం వెంట వెంట‌నే క్లియ‌ర్ చేయ‌క‌పోవడాన్ని ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేవనెత్తారు.ఈ నేప‌థ్యంలోనే కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

కాగా ఎన్డీయే ప్రభుత్వం 2014లో న్యాయమూర్తుల నియామక విధానాన్ని మార్చేందుకు ప్రయత్నించింది. 2014లో తీసుకొచ్చిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (NJAC) చట్టం ఉన్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నియమించడంలో ఎగ్జిక్యూటివ్‌కు ప్రధాన పాత్రను కల్పించింది. కానీ దానిని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios