Asianet News TeluguAsianet News Telugu

అందమైన అమ్మాయి కావాలా అంటూ పోలీసులకు ఎర.. చివరకు

మధురైలో కిడ్నాప్ ల నిరోదక విభాగం పోలీస్ కానిస్టేబుల్ గా తిరుపతి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. కాగా... అతనికి గురువారం సెల్ ఫోన్ లో ఓ మెసేజ్ వచ్చింది. అందమైన అమ్మాయితో జల్సాగా గడపాలని అనుకుంటున్నారా..? ఈ నెంబర్ కి ఫోన్ చేయండి అనేది ఆ మెసేజ్ సారాంశం. తిరుపతి ఆ మెసేజ్ కి ఆకర్షితుడయ్యాడు. వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేశాడు.

Sex racket busted in madhurai , 4 nabbed
Author
Hyderabad, First Published Sep 21, 2019, 12:25 PM IST

ఒకప్పుడు వ్యభిచారం చాలా గుట్టుగా నిర్వహించేవారు. పోలీసులకు ఎక్కడ దొరికిపోతామా అని చాలా మంది కంగారుపడేవారు. కానీ... ఇప్పుడు ట్రైండ్ మారిపోయింది. వాట్సాప్, సోషల్ మీడియా ఉపయోగించి హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఓ వ్యభిచార ముఠా అయితే ఏకంగా పోలీసుకే ఎర వేసింది. ఫోన్ లో మెసేజ్ లు పంపి అతడిని ఆకర్షించారు. అనంతరం వేరే పోలీసులకు చిక్కి... జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  మధురైలో కిడ్నాప్ ల నిరోదక విభాగం పోలీస్ కానిస్టేబుల్ గా తిరుపతి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. కాగా... అతనికి గురువారం సెల్ ఫోన్ లో ఓ మెసేజ్ వచ్చింది. అందమైన అమ్మాయితో జల్సాగా గడపాలని అనుకుంటున్నారా..? ఈ నెంబర్ కి ఫోన్ చేయండి అనేది ఆ మెసేజ్ సారాంశం. తిరుపతి ఆ మెసేజ్ కి ఆకర్షితుడయ్యాడు. వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేశాడు.

ఓ మగ వ్యక్తి ఫోన్ లిఫ్ట్  చేసి.. అతనితో బేరసారాలు ఆడాడు. అనంతరం అతను చెప్పిన అడ్రస్ కి తిరుపతి వెళ్లాడు. అక్కడ ఓ ముఠా తిరుపతిపై దాడి చేసి నగదు మొత్తం లాక్కున్నారు. అనంతరం ఓ యువతితో కలిసి ఓ గదిలో బంధించారు. అక్కడి నుంచి తప్పించుకున్ను తిరుపతి ఈ విషయాన్ని వెంటనే ఇతర పోలీసులకు సమాచారం అందించాడు. అతని సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ముఠాను అరెస్టు చేశారు. ఆ ముఠాలో నలుగురు యువకులు, ఓ స్త్రీ ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios