ఆ బాలికల్లో ఒకరు మళ్లీ మిస్ అయ్యారు..!

Security lapse? Girl rescued from Bihar shelter home goes missing
Highlights

వారిని ఎట్టకేలకు పోలీసులు రక్షించగలిగారు. వారిని ఎన్జీవోకి కూడా తరలించారు.అయితే.. అలా రక్షించిన 11మంది బాలికల్లో ఒక బాలిక మళ్లీ అదృశ్యమైందట. 

బిహార్ రాష్ట్రం ముజఫర్ ఫూర్ లో ఇటీవల కొన్ని దారుణాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న సేవా సంకల్ప్‌ ఏవం వికాస్‌ సమితి అనే ప్రభుత్వేతర సంస్థ నిర్వహిస్తున్న ఆ వసతిగృహంలో 40 మంది బాలికలపై సమితి యజమాని బ్రజేశ్‌ ఠాకూర్‌తో పాటు మరో 10 మంది సిబ్బంది నెలల తరబడి లైంగిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. వీరు కాక.. మరో 11 మంది బాలికలు అదృశ్యం కాగా... వారిని ఎట్టకేలకు పోలీసులు రక్షించగలిగారు. వారిని ఎన్జీవోకి కూడా తరలించారు.

అయితే.. అలా రక్షించిన 11మంది బాలికల్లో ఒక బాలిక మళ్లీ అదృశ్యమైందట. భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకొని ఓ బాలిక అక్కడి నుంచి పారిపోయింది. దీనిపై ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు మాట్లాడుతూ.. ‘‘మా ఎన్జీవోలో కేవలం 11మంది విద్యార్థులకు వసతి కల్పించే అవకాశం ఉంది. అప్పటికే మా దగ్గర 10మంది బాలికలు ఉండగా.. అధికారులు మరో 14మందిని తీసుకువచ్చారు. వారందరికీ వసతులు లేవు అని నేను చెప్పినా.. వినలేదు. వారిని రక్షించడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ ఓ బాలిక మాత్రం మిస్సయ్యింది.’’ అని చెప్పారు.

 అధికారులు తీసుకువచ్చిన బాలికల ఆరోగ్యం కూడా సరిగాలేదని ఆమె చెప్పారు. బాలిక మిస్సింగ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సీసీటీవీ ని ఆధారం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.  అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని మహిళా హాస్టల్స్ కి భద్రత మరింత పెంచాలని ఆదేశించారు. 

 

Read more news..

ఉమెన్స్ హాస్టల్ లో కండోమ్ ప్యాకెట్లు, మద్యం బాటిల్లు

loader