పాట్నా: ఆర్జెడీ ఎమ్మెల్యే అరుణ్ యాదవ్ సెక్స్ రాకెట్ కేసులో చిక్కుకున్నారు. ఆయన కోసం ప్రత్య దర్యాప్తు బృందం (సిట్) గాలింపు చర్యలు చేపట్టింది. ఆయన పట్టుకోవడానికి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు బుధవారంనాడు పాట్నా, భోజ్ పూర్ ల్లోని ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 

అరుణ్ యాదవ్ ను పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు ఆయన ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉంది.  ఎఫ్ఐఆర్ ప్రకారం.... ఓ మహిళ చదువు, ఉద్యోగావకాశాలుంటాయని నమ్మబలికి ఎమ్మెల్యే వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేతో పాటు ఇతరులు బాలికపై అత్యాచారం చేశారు. 

మహిళతో పాటు సెక్స్ రాకెట్ నడిపే వ్యక్తి బాలికను నిర్బంధించారు. ఆమె నుంచి తప్పించుకుని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఎమ్మెల్యే అరుణ్ యాదవ్ అధికారిక నివాసంలోనూ ఇతర ప్రాంతాల్లో తనపై లైంగిక దాడి చేశారని బాలిక ఆరోపించింది. 

ఎమ్మెల్యేపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. దాంతో అరుణ్ యాదవ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఎమ్మెల్యే కోసం గాలిస్తున్న పోలీసులు ఆయన మొబైల్ పై కూడా నిఘా వేశారు. అయితే, అతను గత రెండు రోజులుగా దాన్ని వాడడం లేదు. అరుణ్ యాదవ్ కోసం నియోగించిన బాడీగార్డును ప్రభుత్వం ఉపసంహరించింది.