జోథ్ పూర్: రాజస్థాన్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలి ఇంట్లోకి నిందితుడు చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఈ దాడిలో అత్యాచార బాధితురాలి తండ్రి మరణించాడు. తల్లి, సోదరుడు గాయపడ్డారు. సోమవారం పోలీసులు ఆ విషయం చెప్పారు.

నిందితుడి నుంచి కుటుంబ సభ్యులకు ప్రమాదం ఉందని పలుమార్లు ఫిర్యాదు చేసినా సాద్రి పోలీసు స్టేషన్ ఇంచార్జీ పట్టించుకోలేదని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు.  మృతదేహానికి పోస్టుమార్టం తరలించడానికి ప్రయత్నించిన పోలీసులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. 

Also Read: తుపాకీతో బెదిరించి మైనర్ పై అత్యాచారం.. తర్వాత విషం తాగించి...

సాద్రీలోని గ్రామానికి చెందిన మైనర్ బాలిక అదే గ్రామానికి దన్నారం అనే వ్యక్తితో జులై 14వ తేదీన పారిపోయిందని, నవంబర్ 10వ తేదీన తిరిగి వచ్చిందని అసిస్టెంట్ పోలీసు సూపరింటిండెంట్ బ్రిజేష్ కుమార్ సోనీ చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత బాలిక నవంబర్ 10వ తేదీన ధన్నారంపై కిడ్నాప్, రేప్ కేసులు పెట్టిందని, దానిపై దర్యాప్తు సాగిస్తున్నామని సోనీ చెప్పారు. 

ధన్నారం ఆదివారం రాత్రి బాలిక ఇంట్లోకి చొరబడి కత్తితో కుటుంబ సభ్యులపై దాడి చేశాడని, ఈ దాడిలో బాలిక తండ్రి మరణించాడని అధికారి చెప్పారు. నిందితుడు కూడా గాయపడ్డాడని, పారిపోతున్న ధన్నారంను గ్రామస్థులు పట్టుకున్ారని, అతన్ని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. 

Also Read: దారుణం... నిండు గర్భిణీపై అఘాయిత్యం, బాలికకు గర్భస్రావం.

అలక్ష్యం వహించాడనే ఆరోపణపై జిల్లా ఎస్పీ సాద్రి పోలీసు స్టేషన్ ఇంచార్జీ రాజ్ దీపేందర్ సింగ్ ను సస్పెండ్ చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కాగానే నిందితుడిని అరెస్టు చేస్తామని సోనీ చెప్పారు.