మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం... ఆమెకు విషం తాగించి హత్య చేసే ప్రయత్నం చేశాడు. తర్వాత తాను పోలీసులకు దొరికిపోతానేమో అని భయపడిపోయాడు. అందుకే వెంటనే తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ దేహాత్  జిల్లా, అక్బర్ పూర్ కొత్వాలీ ప్రాంతానికి చెందిన యువకుడు యోగేంద్ర... తన ఇంటికి సమీపంలోని ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. బాలిక ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాడు.

ఇటీవల బాలిక బహిర్బూమికి వెళ్తుండగా... చూశాడు. వెంట తుపాకీ తీసుకువెళ్లి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం యోగేంద్ర సదరు బాలికతో బలవంతంగా విషం తాగించాడు. అనంతరం పోలీసులకు దొరికిపోతానేమో అనే భయంతో అతను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. కాగా... ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.