Asianet News TeluguAsianet News Telugu

ఇకపై ఆ స‌ర్టిఫికెట్ ఉంటేనే.. పెట్రోల్ .. డిజిల్ ..

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు ఆప్‌ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ ఉన్న వాహనాలకే ఇంధనం పోసేలా నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు.

PUC certificate must for buying fuel in Delhi from Oct 25
Author
First Published Oct 2, 2022, 6:34 AM IST

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివార‌ణ‌కు ఆప్‌ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీయూసీ (పొల్యూషన్‌ సర్టిఫికెట్)  లేకుండా దేశ రాజధానిలోని పెట్రోల్ పంపుల్లో వెళ్తే.. ఇంధనం పోయ్య‌ర‌ని , ఈ నిబంధ‌న అక్టోబర్ 25 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.పర్యావరణ, రవాణా, ట్రాఫిక్‌ విభాగాలకు చెందిన అధికారులతో శ‌నివారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్ల‌డించారు.  

ఈ సమావేశ అనంత‌రం మంత్రి రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు పెరగడానికి వాహన ఉద్గారాలు ఎక్కువగా కారణమవుతున్నాయనీ, దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, అందుకే అక్టోబర్ 25 నుంచి వాహనానికి సంబంధించిన పీయూసీ సర్టిఫికెట్ లేకుండా పెట్రోల్ పంపుల వద్ద పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండదని నిర్ణయించామ‌ని తెలిపారు.దీనికి సంబంధించిన  నోటిఫికేషన్  త్వరలో విడుదల చేస్తామని, ఈ వారం చివరి నాటికి పథకం ఎలా అమలు చేయనున్నారనేది స్పష్టత వస్తుందన్నారు.

ఢిల్లీ రవాణా శాఖ ప్రకారం.. జూలై 2022 నాటికి 13 లక్షల ద్విచక్ర వాహనాలు, మూడు లక్షల కార్లతో సహా 17 లక్షల వాహనాలు చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్లు లేకుండా రోడ్లపై తిరుగుతున్నాయి. PUC సర్టిఫికేట్  లేనట్లయితే..  వాహ‌నాదారునికి  మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 10,000 జరిమానా లేదా కొన్ని సంద‌ర్బాల్లో రెండింటితో శిక్షించబడవచ్చు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా తమ వాహనాలకు సంబంధించిన పీయూసీ సర్టిఫికెట్లను సరిచూసుకోవాలని  మంత్రి సూచించారు. 

'నో PUC, నో ఫ్యూయల్' చర్యను అమలు చేయడంపై  మార్చి 3, 2022న సూచనలను కోరుతూ.. పబ్లిక్ నోటీసును జారీ చేసామని,  మే 2న ప్రతిపాదనలు అందాయని, చాలా మంది ఈ చ‌ర్య‌ను  అమలు చేయాలని కోరడంతో అక్టోబర్ 25 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు.

కాలుష్యాన్ని పరిష్కరించడానికి, రివైజ్డ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 3 నుండి 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ప్రారంభిస్తుందని మంత్రి రాయ్ చెప్పారు. అక్టోబరు 6 నుంచి ఢిల్లీలో డస్ట్ డ్రైవ్  ప్రారంభిస్తామని, దీని కింద నిర్మాణ స్థలాలను ఆకస్మిక తనిఖీలు చేసి, దుమ్ము వల్ల కలిగే కాలుష్యాన్ని తనిఖీ చేస్తామని రాయ్ చెప్పారు.

5,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న నిర్మాణ స్థలాల్లో ఒక యాంటీ స్మోగ్ గన్‌ను, 10,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న నిర్మాణ స్థలాల్లో రెండు స్మోగ్ గన్స్ ను, 20,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న నిర్మాణ స్థలాల్లో నాలుగు స్మోగ్ గన్స్ ను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.  నిర్మాణ స్థలాల్లో కంపెనీలు ఈ చర్యలను అమలు చేయకుంటే, డస్ట్ డ్రైవ్‌లో భాగంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాయ్ తెలిపారు. కాలుష్యాన్ని పరిష్కరించడానికి అన్ని జాతీయ రాజధాని ప్రాంత (NCR) రాష్ట్రాలకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను కూడా మంత్రి పిలుపునిచ్చారు.

గత సంవత్సరం ప్రచురించబడిన CSE నివేదికను ప్రస్తావిస్తూ.. రాయ్ ఢిల్లీ కాలుష్యంలో కేవలం 31 శాతం మాత్రమే నగరంలో మూలాల నుండి ఉద్భవించిందని మరియు రాజధాని కాలుష్యంలో 69 శాతానికి NCR ప్రాంతం కారణమని చెప్పారు. అలాగే.. శీతాకాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, దాని పర్యవేక్షణ,  అమలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఎన్‌సిఆర్ రాష్ట్రాల ప్రభుత్వాలకు రాయ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో పిచ్చిమొక్కలు తగులబెట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం అక్టోబర్ 10వ తేదీ నుంచి వ్యవసాయ ప్రాంతాల్లో పూసా బయో డీకంపోజర్‌ను ఉచితంగా పిచికారీ చేయనుందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios