పోర్న్ కి బానిసగా మారిన ఓ వ్యక్తి.. కడుపుతో ఉన్న తన భార్యపై లేనిపోని అబాండాలు వేశాడు. తన భార్య ఓ పోర్న్ వీడియోలో నటించిందని.. పరాయి పురుషుడితో తన భార్య సెక్స్ చేసిందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకి చెందిన వెంకటేష్ కి ఆంధ్రప్రదేశ్ కి చెందిన లక్ష్మితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బిడ్డ కూడా ఉంది. లక్ష్మి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి.  అయితే.. వెంకటేష్ కి మొదటి నుంచి పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది. ఆ అలవాటు కాస్త ఇప్పుడు బానిసగా మారింది. ఇటీవల వెంకటేష్.. ఓ పోర్న్ వీడియో చూడగా.. అందులో నటించింది తన భార్యే అంటూ ఆరోపించడం మొదలుపెట్టాడు.

ఈ కారణం చూపుతూ.. భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఈ బాధ తట్టుకోలేక.. లక్ష్మి.. భర్తను వదిలేసి తన పుట్టింటికి వెళ్లింది. అయినా.. వెంకటేష్ ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు. బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియోలో ఉన్న మహిళకు ఎక్కడైతే పుట్టుమచ్చలు ఉన్నాయో.. అక్కడే తన భార్యకి పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పడం విశేషం. 

ఆ పోర్న్ వీడియోని పోలీసులకు కూడా పంపించాడు. దీనిపై సైబర్ క్రైమ్ అధికారులు విచారణ జరపగా...ఆ వీడియో అసలు ఇండియాలోనే తీసింది కాదని తేలింది. ఇదే విషయాన్ని వెంకటేష్ కి అధికారులు చెప్పినప్పటికీ.. అతను నమ్మకపోవడం గమనార్హం. వేరే వ్యక్తితో గడిపిన భార్య తనకు వద్దంటూ ఆరోపించడం మొదలుపెట్టాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.