స్పా పేరిట రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ  ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా సెక్టార్ లో గత కొంతకాలంగా ఓ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

నోయిడా సెక్టారు 18లోని స్పాలో ఉన్న బాలికలు కస్టమర్లతో వ్యభిచారం చేస్తున్నారని తమకు వచ్చిన సమాచారం మేర ఆకస్మిక దాడి చేశామని నోయిడా డీసీపీ రాజేష్ చెప్పారు. స్పాలో వ్యభిచారం చేస్తున్న 14 మంది బాలికలను బాధితులుగా భావించి వారిని కాపాడామని డీసీపీ చెప్పారు. 

స్పా యజమానులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశామని డీసీపీ చెప్పారు. 14మంది బాధిత బాలికలను పునరావాస కేంద్రానికి తరలించినట్లు డీసీపీ చెప్పారు. స్పా మాటున వ్యభిచారం సాగిస్తున్నందున భవన యజమానికి నోటీసు పంపిస్తున్నట్లు డీసీపీ వివరించారు.