Asianet News TeluguAsianet News Telugu

టెర్రర్ ఫండింగ్‌కు డిజిటల్ కరెన్సీ వాడుతున్నారు: ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ కరెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది టెర్రర్ ఫండింగ్‌కు యూజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రైవేట్ కరెన్సీ దేశ భద్రతకూ ముప్పుగా ఉంటుందని వివరించారు.
 

pm modi says digital currency used for financing terror
Author
First Published Nov 18, 2022, 8:19 PM IST

న్యూఢిల్లీ: డిజిటల్ కరెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. టెర్రర్ ఫండింగ్ కోసం ఈ కరెన్సీ వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగితం కాకుండా ఉండటానికి డిజిటల్ కరెన్సీకి మరిన్ని కఠినమైన రెగ్యులేషన్స్ అవసరం అని స్పష్టం చేశారు. ఉగ్రవాద గ్రూపులకు ఆర్థిక దారుల అడ్డగించే లక్ష్యంతో ఉన్న ఓ ప్రముఖ అంతర్జాతీయ వేదిక పై శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

స్థానిక వాణిజ్య వేదికలు, ప్రముఖ సెలెబ్రిటీల ఆమోదంతో భారత్‌లో క్రిప్టోకరెన్సీ అపారంగా పెరిగిందని, వాటిని అదుపు చేయడానికి భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని వివరించారు. భావి తరాలకు బిట్ కాయిన్ ద్వారా ముప్పు పొంచి ఉందని, అది యువతను నాశనం చేస్తుందని గతేడాది ప్రధాని మోడీ అన్న సంగతి తెలిసిందే. బిట్ కాయిన్ తప్పుడు చేతుల్లో పడితే ఇక అంతే అని హెచ్చరించారు.

తాజాగా, ఈ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ప్రైవేట్ కరెన్సీ రక్షణ ముప్పును కలిగించే అవకాశం ఉన్నదని ప్రధాని అన్నారు. టెర్రర్ ఫైనాన్సింగ్, రిక్రూట్‌మెంట్‌కు కొత్త దారులను వినియోగిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. అలాగే, డార్క్ నెట్, ప్రైవేట్ కరెన్సీలు, ఇతర మరెన్నో సవాళ్లు కొత్తగా ముందుకు వస్తున్నాయని వివరించారు. కాబట్టి, కొత్త ఫైనాన్సింగ్ టెక్నాలజీలపై అందరూ ఆలోచించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఒకే తరహా ఆలోచనలకు రావాలని, వాటి నుంచే డిజిటల్ కరెన్సీ నియంత్రణలో ఉంచే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. అందుకు తగిన రెగ్యులేషన్స్ కూడా వస్తాయని తెలిపారు.

Also Read: Explainer: డిజిటల్ రూపాయి అంటే ఏమిటి, క్రిప్టో కరెన్సీకి , డిజిటల్ రూపాయికి తేడా ఏంటి..?

గత నెల ఐరాస్ కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశం భారత్‌లో జరిగింది. తాజాగా, ఈ సదస్సు దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇది రెండు రోజుల కాన్ఫరెన్స్. 

మన దేశంలో క్రిప్టోకరెన్సీలు అన్నీ భారత రెగ్యులేటరీ పరిశీలనలోనే ఉన్నాయి. మన దేశంలోకి తొలిసారి సుమారు దశాబ్దం క్రితం ఇవి ప్రవేశించాయి. అయితే, వీటి ద్వారా తప్పుడు లావాదేవీలు వెలుగులోకి రావడంతో 2018లో ఆర్బీఐ బ్యాన్ చేసింది. రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఈ కరెన్సీలపై అన్ని రకాల అడ్డంకులను ఎత్తేసింది. దీంతో 2021 జూన్ నాటికి అంటే సుమారు ఏడాది కాలంలో ఈ కరెన్సీ 650 శాతం పెరిగింది.

కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని ప్రైవేట్ కరెన్సీలపై నిషేధం విధించే ప్రతిపాదన చేసింది. కానీ, చివరకు ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకుని అన్ని ప్రైవేట్ కరెన్సీలపై వచ్చిన లాభంపై 30 శాతం ట్యాక్స్ విధించాలని నిర్ణయం తీసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios