JNU: ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) చరిత్రలో తొలిసారిగా వైస్-ఛాన్సెలర్‌గా ఓ మహిళకు అవకాశం దక్కింది. ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను జేఎన్‌యూ వీసీగా నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ సోమవారం ఓ ప్రకటన జారీచేసింది. అయితే, ఆమె నియామ‌కాన్ని బీజేపీ నేత వ‌రుణ్ గాంధీ ప్ర‌శ్నించారు. జేఎన్‌యూ వీసీగా ఆమెను నియ‌మించ‌డం దారుణ‌మ‌నే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ఆమె చేసిన పోస్టుల తప్పిదాలను ఎత్తి చూపారు. 

JNU: ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) చరిత్రలో తొలిసారిగా వైస్-ఛాన్సెలర్‌గా ఓ మహిళకు అవకాశం దక్కింది. ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను జేఎన్‌యూ వీసీగా నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ సోమవారం ఓ ప్రకటన జారీచేసింది. అయితే, ఆమె నియామ‌కాన్ని బీజేపీ (భారతీయ జనతా పార్టీ) నేత వ‌రుణ్ గాంధీ (BJP Leader Varun Gandhi) ప్ర‌శ్నించారు. జేఎన్‌యూ వీసీగా ఆమె (Santishree Dhulipudi Pandit)ను నియ‌మించ‌డం దారుణ‌మ‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక ట్వీట్‌లో పండిట్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో బహుళ వ్యాకరణ తప్పులను ఎత్తి చూపారు.

"కొత్త JNU VC నుండి వచ్చిన ఈ పత్రికా ప్రకటన నిరక్షరాస్యత ప్రదర్శన, వ్యాకరణ తప్పిదాలతో నిండి ఉంది(would strive vs will strive; students friendly vs student-friendly; excellences vs excellence). ఇటువంటి సాధారణ నియామకాలు మన మానవ మూలధనాన్ని, మన యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయి" అని వరుణ్ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) చరిత్రలో తొలిసారిగా వైస్-ఛాన్సెలర్‌గా ఓ మహిళకు అవకాశం దక్కింది. ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను జేఎన్‌యూ వీసీగా నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ సోమవారం ఓ ప్రకటన జారీచేసింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ, సంబంధిత మంత్రిత్వ శాఖ‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ... ట్విట్ట‌ర్ లో ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఇందులో దొర్లిన త‌ప్పుల‌ను బీజేపీ నేత వ‌రుణ్ గాంధీ ఎత్తి చూపారు. 

Scroll to load tweet…

ఇదిలావుండ‌గా, ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వైస్-ఛాన్సెలర్‌గా ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను నియ‌మిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసిన త‌ర్వాత‌.. ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఇదివ‌ర‌కు చేసిన ప‌లు పోస్టులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అలా వైర‌ల్ అయిన పోస్టుల‌లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు, రైతుల‌ను విమ‌ర్శిస్తున్న పోస్టులు కూడా ఉన్నాయి. అయితే, ఈ ట్విట్ట‌ర్ అకౌంట్ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాగా ధ్రువీక‌ర‌ణ కాక‌పోయిన‌ప్ప‌టికీ.. వివాద‌స్ప‌ద వైర‌ల్ పోస్టుల‌ను వెంట‌నే తొల‌గించారు. 

Scroll to load tweet…

కాగా, ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వైస్-ఛాన్సెలర్‌గా ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను నియ‌మ‌కాన్ని ప్ర‌శ్నిస్తున్న బీజేపీ నేత వ‌రుణ్ గాంధీ కూడా జేఎన్‌యూ (Jawaharlal Nehru University) పూర్వ విద్యార్థినే. కాగా, ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను జేఎన్‌యూ వీసీగా నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ సోమవారం ఉత్త‌ర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ శాంతిశ్రీ ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రీబాయ్ ఫూలే మహిళా యూనివర్సిటీ వీసీగా ఉన్నారు. కాగా, డాక్టర్ శాంతిశ్రీ జేఎన్‌యూ పూర్వ విద్యార్థి కావడం విశేషం. ఈ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. అలాగే, అంతర్జాతీయ సంబంధాలలో పీహెచ్‌డీ చేశారు.