సినీ నటి, కాంగ్రెస్ మహిళానే ఖుష్బూ వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ని కించపరుస్తూ.. ఆమె చేసిన కామెంట్స్ పై ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు. ఏకంగా రేప్ చేస్తామంటూ కూడా బెదిరించడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే...

ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అంగరంగ వైభవంగా భూమి పూజ పూర్తయింది. ప్రధాని మోదీ స్వయంగా హాజరై ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. హిందువుల దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారంటూ బీజేపీ నేతలు ప్రశంసలు కురిపించారు.

 

మోదీని యుగ పురుషుడిగా కీర్తిస్తూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అయింది. ఆ ఫొటోలో మోదీ.. బాల రాముడి చేయి పట్టుకుని రామ మందిరం వైపు నడిపిస్తున్నారు. ఈ ఫొటోపై సీనియర్ హీరోయిన్, తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ తనదైన శైలిలో స్పందించారు. `ఇప్పుడు రాముడి కంటే మోదీ పెద్దవాడయ్యారన్నమాట. ఏం కలియుగం` అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.  రేప్ చేస్తామంటూ ఆమెను బెదిరిస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.