Asianet News TeluguAsianet News Telugu

పోర్న్ స్టార్ బ్లాక్ మెయిల్ చేస్తోంది.. వీడియో తీసుకుని ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం, పరిస్తితి విషమం..

ఓ పోర్న్ స్టార్ బ్లాక్ మెయిల్ చేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన షాకింగ్ ఘటన ఉజ్జయినిలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఆ కుటుంబం పరిస్థితి విషమంగా ఉంది.

Mumbai porn star Blackmail, family of three consume poison in ujjain
Author
First Published Dec 24, 2022, 8:34 AM IST

ఉజ్జయిని : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు 'పోర్న్ స్టార్' బ్లాక్ మెయిల్ తట్టుకోలేక విషం తాగారు. ముంబైకి చెందిన యువతి ఉజ్జయిని నివాసి ఆషి ఖాన్‌ను 'అక్రమ సంబంధాల' పేరుతో బ్లాక్ మెయిల్ చేసింది. ఉజ్జయినిలోని ఖరకువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ నీలి చిత్రాల నటి, ఎయిర్హోస్టెస్ డబ్బుల కోసం తమను వేధిస్తోందని.. ఆ వేధింపులు భరించలేమంటూ ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీడియో అది. ఆ వీడియోలో ఉన్న ముగ్గురు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆ వీడియోలో ఉన్న అషిఖాన్ అనే వ్యక్తి.. ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ముంబైకి చెందిన ఒక పోర్న్ స్టార్ తమని బ్లాక్మెయిల్ చేస్తోందని, డబ్బు కోసం తమ కుటుంబాన్ని కొంతకాలంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసిందని, తన కుటుంబానికి డబ్బుల కోసం నరకం చూపిస్తోందని అతడు ఆరోపించాడు. 

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతులను అరెస్ట్ చేసిన సీబీఐ

అంతేకాదు ఈ వేధింపులు ఇంక తట్టుకోలేక పోతున్నాను అంటూ తల్లి, భార్యతో కలిసి విషం తాగాడు. ఆ వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోలో అతను మాట్లాడుతూ.. తన పేరు అషిఖాన్ అని, ఉజ్జయినిలోని లోహె ఫుల్ లో ఉంటున్నామని చెప్పుకొచ్చాడు. రిమ్ జిమ్ అనే పోర్న్ స్టార్ తో ముంబైలో ఉంటున్న సమయంలో పరిచయం ఏర్పడింది. దీన్ని సాకుగా తీసుకుని.. ఆమె గత కొంతకాలంగా నామీద వేధింపులకు పాల్పడుతోంది. ఆమె అలా చేస్తుందని నేను ఊహించలేదు. దీంతో నేను షాక్ అయ్యాను. రిమ్ జిమ్ తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని  వేధిస్తోంది. లేకపోతే ఆత్మహత్య చేసుకొని నన్ను ఇరికిస్తానని బెదిరిస్తోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఓ సారి నా వివాహం సమయంలో రిమ్ జిమ్ కు కొంత డబ్బులు కూడా ఇచ్చాను. 

అప్పటికి ఆమె ఊరుకుంది. అయితే వేధింపులు ఆపలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ మొదలు పెట్టింది. ముంబైలో ఉన్న సమయంలో నాతో పరిచయం పెంచుకుని.. సన్నిహితంగా మెలిగింది. ఆ సాకుతో నేను తనను రేప్ చేశానని నాపై రేప్ కేసు పెట్టి జైలుకు కూడా పంపింది. అలాగే, ఇప్పుడు కూడా చేస్తానని, నన్ను జైలుకు పంపిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. రోజురోజుకు ఆమె వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వాటిని భరించలేక పోతున్నాం. ఆ వేధింపులు తట్టుకోవడం కంటే  కుటుంబంతో కలిసి  ఆత్మహత్య చేసుకోవడం సరైన మార్గం అనిపిస్తోంది… అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం.. అంటూ అషిఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 

అషిఖాన్ కు ఉజ్జయినిలో లోకల్ గా ఓ బట్టల దుకాణం ఉంది. ఇక అతని మీద  వేధింపులకు పాల్పడి.. ఆత్మహత్యయత్నానికి కారణం అయిన రిమ్ జిమ్ అసోంలోని గువాహతికి చెందిన వ్యక్తి అని సమాచారం. రిమ్ జిమ్ ముంబైలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూ..  తరచుగా అడల్ట్ యాప్ మూవీలు, బ్లూ ఫిల్మ్స్ లలో నటిస్తుంది. దీంతోపాటు వివాహితులైన వారిని లక్ష్యంగా చేసుకుని, వారితో పరిచయం పెంచుకుని… వారిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతుంది అని సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో బంధువులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించేలా చేశారు.  అయితే,  వీరి ఆత్మహత్యాయత్నానికి కారణమైన నిందితురాలిని పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకున్నారు లేదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios