Asianet News TeluguAsianet News Telugu

దుర్గాపూజను చూసి ఇంటికి తిరిగివస్తున్న మైనర్‌పై సామూహిక అత్యాచారం

Muzaffarpur: మహా దుర్గాష్టమి సందర్భంగా సోమవారం సాయంత్రం దుర్గాపూజను చూసి తిరిగి ఇంటికి వెళ్లున్న బాలిక‌ను కిడ్నాప్ చేసిన దుండ‌గులు.. సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) చేశారు. ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. 
 

Minor gang-raped while returning home after watching Durga Puja
Author
First Published Oct 4, 2022, 12:03 PM IST

Gang Rape: దేశంలో మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై నేరాలు, అత్యాచారాలు, హింసా పెరుగుతున్న‌ద‌ని ఇప్ప‌టికే ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా లైంగిదాడి ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం కొత్త చ‌ట్టాలు తీసుకువ‌చ్చిన వారిపై దాడులు మాత్రం ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఓ దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దుర్గాపూజ‌ను చూసి.. ఇంటికి వెళ్తున్న ఒక బాలిక‌ను కిడ్నాప్  చేశారు. ఆపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్‌) చేశారు. ఈ ఘ‌ట‌న బీహార్ లో చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మైనర్‌పై సామూహిక అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ముజఫర్‌పూర్‌లోని ఔరాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దుర్గాపూజ చూసి తిరిగి ఇంటికి వస్తున్న మైనర్‌ బాలికపై నలుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. కేసు న‌మోదుచేసుకునీ, అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం త్వరితగతిన చర్యలు తీసుకున్న పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు.

ఈ కేసు ముజఫర్‌పూర్‌లోని ఔరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దుర్గామహాష్టమి రోజు సాయంత్రం ఓ మైనర్ బాలిక జాతరను చూసి ఇంటికి తిరిగి వస్తోంది. అయితే, దారి మార్గ‌మ‌ధ్య‌లో మైన‌ర్ బాలిక ఒక్క‌తే ఉండ‌టంతో ఆ దారిలో రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు కుర్రాళ్లు ఆమెను బలవంతంగా బైక్ పై ఎక్కించుకున్నారు. బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు.. స్థానికంగా ఉన్న అడ‌వీ ప్రాంతంలో తీసుకెళ్లారు. ఆ తర్వాత నలుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయారు. ఈ ఘటన తర్వాత బాలిక పరిస్థితి విషమంగా మారింది. తనకు జరిగిన సంఘటనను ఎలాగోలా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. 

బాధితురాలిని చికిత్స కోసం ఔరాయ్ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. అయితే, బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెను ఎస్‌కెఎంసిహెచ్‌కు రెఫర్ చేశారు. ఈ ఘటనపై ఔరాయ్ పోలీసులు అప్రమత్తమై నిందితులను పట్టుకోవడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొందరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ముజఫర్‌పూర్‌లోని ఎస్‌కెఎంసిహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్యాంగ్ రేప్.. ఆపై విక్ర‌యం

గ‌తవారం కూడా ఒక దారుణ ఘ‌ట‌న బీహార్ వెలుగుచూసింది. మధుబని జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసి విక్రయించిన కేసులో ఒక మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలికపై పలువురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, మహిళాను రూ.50,000లకు అమ్మేశారన్నారు. గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన బృందం సోనీ దేవి అనే మహిళా పింప్ చెర నుంచి బాలికను రక్షించి కేసును చేధించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అరెస్టయిన వారిని జైనగర్‌లోని అశోక్ మార్కెట్‌లో నైట్‌గార్డు సోనీ దేవి, అర్జున్ యాదవ్, ఎలక్ట్రీషియన్ సాజన్ కుమార్‌గా గుర్తించారు. జైనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆచార్య పోలీస్ డ్రైవర్, రామ్‌జీవన్ పాశ్వాన్ అనే చోకీదార్ పరారీలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios