Asianet News TeluguAsianet News Telugu

అటు రీల్ స్టార్లు.. ఇటు రియల్ స్లార్లు..  వైసీపీ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే..

Andhra Pradesh Assembly Elections:  ఏపీలో ఎన్నికల హీట్ మామూలుగా లేదు. మరో కొన్ని గంటల్లో ప్రచారం పర్వం ముగియనుండటంతో రాజకీయ సమీకరణాలు, వ్యూహా ప్రతివ్యూహాలు కూడా శరవేగంగా మారుతున్నారు. 

Andhra Pradesh Assembly elections The YSRCP has submitted commoners as star campaigners to the Election Commission KRJ
Author
First Published May 9, 2024, 5:40 PM IST

Andhra Pradesh Assembly Elections: మరో 72 గంటల్లో  ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే మెజారిటీ సర్వేలు అధికార వైసీపీకే జై కొడుతున్నాయి. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలోకి రావడానికి కారణమవుతున్నాయనీ,  ఈ సారి ఏపీలో వైసీపీకి అధికారం ఖాయమని, మరో జగన్ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. ఏపీలో అధికారం చేపట్టాలనే ఏ పార్టీ అయినా.. 88 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ మ్యాజిక్ ఫిగర్ ను వైసీపీ సులువుగానే క్రాస్ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుందని వైసీపీ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

కూటమి ప్రచారం ఇలా.. 

రసవత్తరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ప్రతిపక్ష కూటమి తరుఫున సినీ నటులు, తారాలు ప్రచారాన్ని సాగిస్తున్నారు. టీడీపీ తరుపున బాలయ్య బాబు ఎన్నికల బరిలో దిగి ప్రచారం చేస్తుండగా.. ఇక జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. పిఠాపురం నుంచి పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జబర్దస్త్ టీమ్ ప్రచారం సాగుతుంది. ఇక మెగా కాంపౌండ్ లోని హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ వంటి హీరోలు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటేయాలని అడుగుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

జగన్ ప్రచారం ఇలా.. 

ఇలా కూటమి తరుపున అగ్ర సినీ తారలు ప్రచారం చేస్తే.. వైఎస్సార్‌సీపీ మాత్రం అందుకు భిన్నంగా ప్రచారం చేస్తుంది. సామ్యానులే స్టార్‌ క్యాంపెయినర్లనీ, లబ్దిదారులే తమ ప్రచార సారధులుగా ముందుకు సాగుతోంది.ఓ వైపు అంతా తానై జగన్ ప్రచారం చేస్తుండగా.. మరోవైపు తన ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందిన లబ్దిదారులు తన ప్రచారకులను సీఎం జగన్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 తమ ప్రభుత్వం ప్రజాపాలనను అందించిందనీ, ప్రభుత్వ చేయూతతో అభివృద్ధి సాధించి, కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్న సాధారణ ప్రజలే తన ప్రచారకులని జగన్ ఎన్నికల సమారానికి సిద్దమయ్యారు. రసవత్తరంగా సాగుతున్న ఈ ఎన్నికల పర్వంలో ఆ గట్టున సినిమా క్యాంపెయినర్లుగా  ఉంటే..  ఈ గట్టున సామాన్యులే  క్యాంపెయినర్లుగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రచారం చేస్తున్నారన్న మాట. ఏదిఏమైనా..  చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా ఈ సామాన్యులే స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రకటించిన ఘనత వైఎస్సార్‌సీపీ దక్కుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios