థానే: మూఢ నమ్మకాన్ని ఆసరా చేసుకుని ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. చేతబడి వల్ల పడుతున్న బాధలను తొలగిస్తానని చెప్పి ఓ వ్యక్తి 35 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశాడు. మధ్యప్రదేశ్ లోని థానేలో ఈ సంఘటన జరిగింది.

ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు నూర్ మొహమ్మద్ షేక్ (49) కోసం, అతని భార్య రుబీనా (33) కోసం గాలించి శుక్రవారం అరెస్టు చేశారు. థానేలోని రాబోడీకి చెందిన షేక్ చేతబడి వల్ల సంభవిస్తున్న చెడును తొలగిస్తానని షేక్ చెప్పడమే కాకుండా అందుకు రూ.1.48 లక్షలు ఖర్చవుతుందని చెప్పి ఆ మొత్తాన్ని 2015లో తీసుకున్నాడు. 

షేక్, అతని భార్య బాధితురాలి తల్లి నుంచి రూ.30 వేల రూపాయలు కూడా తీసుకున్నారు. 2015 నుంచి నిందితుడు ఆ మహిళపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఆ అత్యాచారాన్ని అతని భార్య వీడియోలో చిత్రీకరిస్తూ వచ్చింది.

తనకు లొంగిపోకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తానని నూర్ షేక్ మహిళను బెదిరిస్తూ వచ్చాడు. వీడియోను బయటపెడుతానని బెదిరించి షేక్ ఆమె నుంచి రూ. 50 వేలు కూడా తీసుకున్నాడు.