కాంగ్రెస్ తో శివసేన: ఈ నాటి ఈ 'మహా' బంధమేనాటిదో...
సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ హిందుత్వ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకున్న శివసేనతో కలవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే శివసేన గతంలో కూడా చాల సార్లు కాంగ్రెస్ కి మద్దతు తెలిపింది. కలిసి పొత్తు పెట్టుకోకపోయినా, శివసేన కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఎన్నిసార్లు అలా శివసేన కాంగ్రెస్ కు మద్దతు పలికింది, ఏ సందర్భాల్లో పలికిందో చూద్దాం.
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ, పూటకో ట్విస్టుతో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని తలిపిస్తుంది. ఎట్టకేలకు శివసేన తన చిరకాల భాగస్వామికి విడాకులిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ,కాంగ్రెస్ ల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం దాదాపుగా ఖాయమైపోయింది.
ఈ నేపథ్యంలో సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ హిందుత్వ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకున్న శివసేనతో కలవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే శివసేన గతంలో కూడా చాల సార్లు కాంగ్రెస్ కి మద్దతు తెలిపింది. కలిసి పొత్తు పెట్టుకోకపోయినా, శివసేన కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఎన్నిసార్లు అలా శివసేన కాంగ్రెస్ కు మద్దతు పలికింది, ఏ సందర్భాల్లో పలికిందో చూద్దాం.
Also read: మహారాష్ట్ర: శివసేనకు బయటి నుంచే కాంగ్రెస్ మద్ధతు
తొలిసారిగా 1967 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థికి శివసేన మద్దతు ప్రకటించింది. పార్టీ ఏర్పాటు చేసి కేవలం ఒక్క సంవత్సరమే అవ్వడం, పార్టీ అప్పటి సిద్ధాంతం మరాఠాలకు పెద్ద పీట వెయ్యడమే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది.
ఆ తరువాత 1975లో బాల్ ఠాక్రే ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని సమర్థిస్తూ దానికి మద్దతు పలికాడు. నాయకత్వం అనేది ప్రేమతో కూడిన నియంతృత్వంతో ఉండాలని పదే పదే బల్ ఠాక్రే అనేవాడు. అందుకోసమే ఇందిరా గాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితిని సమర్థించాడు.
Also read: మహా మలుపు: కిస్సా కుర్సీ కా నై, బీజేపీతో శివసేన వైరం వెనక ఇదే...
1980 సంవత్సరం లో కాంగ్రెస్ అభ్యర్థికి ఏఆర్ అంతులే కి మద్దతు ప్రకటించారు. జనతా పార్టీ ప్రభుత్వం తోని విసుగెత్తిపోయి ఉన్న కారణంగా కాబోలు లాయర్ అంతులేకి శివసేన మద్దతు ప్రకటించింది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే అంతులే ఒక ముస్లిం కుటుంబానికి చందిన వ్యక్తి అవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం.
1990 నుంచి బీజేపీతోని జత కట్టిన శివ సేన అప్పటి నుండి బీజేపీతోని తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. 2014లో బీజేపీతోని విడిపోయి సొంతగా పోటీ చేసినా, ఫలితాల తరువాత మాత్రం ఇరువురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.
బీజేపీతోని సఖ్యత కొనసాగిస్తుండగానే కాంగ్రెస్ కి రెండు సందర్భాల్లో శివ సేన తన మద్దతు ప్రకటించింది. 2007లో ప్రతిభ పాటిల్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించగానే వారికి మద్దతు తెలిపింది. ఇదే విధంగా 2012లో కూడా రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని బలపర్చింది.
కాంగ్రెస్ సేనల మధ్య పొత్తు పొడవనున్న నేపథ్యంలో ఈ బంధం మాత్రం ఈ నాటిది కాదు ఏ నాటిదో అని మాత్రం అనుకోవాల్సిందే.