LPG Vessel Shivalik: యుద్ధాన్ని,మిసైళ్లను తప్పించుకొని భారత్ చేరుకున్న మరో నౌక

Share this Video

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధి దాటి భారత LPG ట్యాంకర్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉన్న ముంద్రా పోర్ట్ వద్ద ఈ నౌక డాక్ అయిన తాజా దృశ్యాలు. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఆయిల్ ట్రాన్సిట్ మార్గమైన హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ ఆయిల్ సరఫరాలో సుమారు 20% రవాణా జరుగుతుంది. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గాలపై భద్రతా ఆందోళనలు ఉన్నప్పటికీ, భారత గృహ వినియోగ LPG సరఫరాకు కీలకమైన ఈ నౌక సురక్షితంగా ముంద్రా పోర్ట్ చేరడం ప్రజలకు కొంత ఊరట కలిగించే పరిణామంగా భావిస్తున్నారు.

Related Video