దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా బయటకు చెబుతున్నారు. దీనిని స్పూర్తిగా తీసుకుని తనకు జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేసిన ఒక మహిళా న్యాయవాది అనుమానాస్పద స్థితిలో మరణించారు.
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా బయటకు చెబుతున్నారు. దీనిని స్పూర్తిగా తీసుకుని తనకు జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేసిన ఒక మహిళా న్యాయవాది అనుమానాస్పద స్థితిలో మరణించారు.
అండమాన్ & నికోబార్ దీవులకు చెందిన పుష్ప అర్చనా లాల్ ఎల్ఎల్‌బీ పూర్తి చేసి 2017లో బెంగళూరుకు వచ్చారు. స్థానికంగా పేరు మోసిన జయంత్ పట్టాన్‌శెట్టి అసోసియేట్స్‌లో లా ఇంటర్న్‌గా జాయిన్ అయ్యారు.
ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు న్యాయవాది చంద్ర నాయక్ వద్ద ఆమె తన ఇంటర్న్‌షిప్‌ను మొదలుపెట్టారు. ఆఫీసులో అర్చనాపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన చంద్రనాయక్ తరువాత ప్రభుత్వ న్యాయవాది చేతన్ దేశాయ్‌తో కలిసి వేధింపులకు దిగారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దానితో పాటు తనకు బలవంతంగా మద్యాన్ని తాగించి చిత్రహింసలకు గురిచేశారని ఆమె ఈ నెల 20న వ్యాలికావల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మల్లేశ్వరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న అర్చన అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసిన పనిమనిషి ఆమెను ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేయింగ్ గెస్ట్ ఓనర్ కూడా అర్చన మృతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు ఫిర్యాదుకు, ఆమె మరణానికి సంబంధం ఉందని పోలీసులకు తెలిపారు.
అబ్బాయిలు మాట్లాడట్లేదు.. మీటూ పై హీరోయిన్ కామెంట్!
‘మీటూ’ ఎఫెక్ట్: సెలవుపై సోథ్ బే ఎండీ గౌరవ్ భాటియా
‘మీటూ’:మోహన్ లాల్ ని ఉద్దేశించి రేవతి ఘాటు ట్వీట్
#మీటూ అనేది ఉద్యమమే కాదు.. అదొక వెర్రి: స్టార్ హీరో కామెంట్స్!
‘మీటూ’ఎఫెక్ట్: చిన్మయి కెరీర్ పై దెబ్బ...కక్ష సాధింపు చర్య
మీటూ: అర్జున్ కి షాకిచ్చిన కోర్ట్.. సీన్ రివర్స్!
‘మీటూ’ ఎఫెక్టేనా?!: ఫ్లిప్ కార్ట్ సీఈఓ కం చైర్మన్ గా బిన్నీ బన్సల్ రిజైన్!!
‘మీటూ’:‘అన్నమయ్య’ హీరోయిన్ సెన్సేషన్ కామెంట్
ఎఫైర్ పెట్టుకొని ఇప్పుడు మీటూ అంటోంది.. నీహారికపై హీరోయిన్ కామెంట్స్!
మీటూ: నన్ను అలా అడిగితే చితకొట్టేస్తా..హీరోయిన్ కౌంటర్!
మీటూ ఎఫెక్ట్...ఆ ఎన్నారై జర్నలిస్టుతో సంబంధం ఉంది...కానీ...: ఎంజే. అక్బర్
