ఈ మధ్య కాలంలో మీటూ ఇచ్చిన షాకులు అన్ని ఇన్ని కావు. హీరోయిన్స్ చాలా వరకు ఏకధాటిగా సెలబ్రెటీలపై చేసిన విమర్శలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే మరికొంత మంది హీరోయిన్స్ తాము ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని చెబుతున్నారు. అందులో సవ్యసాచి హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా చేరింది. 

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు మీటూ గురించి స్పందించింది. తన వద్దకు సెక్సువల్ ప్రపోజల్స్ అంటూ ఎవరు బలవంతం చేయలేదని ఒకవేళ అలాంటి ఆలోచనతో ఎవరైనా ఉంటె ముందే గట్టిగా ఆలోచించుకోవాలని చెబుతోంది. ఎందుకంటే తనకు బాక్సింగ్ వచ్చని చితకొట్టేస్తానని డిఫరెంట్ గా స్పందించింది. 

ఇక మీటూ గట్టిగానే నడుస్తోందని అలాంటి చేదు అనుభవాలను తానెప్పుడూ ఎదుర్కోలేదని తెలుపుతూ.. బాక్సింగ్ తో పాటు తనకు మార్షల్ ఆర్ట్స్ కూడా తెలుసనీ నిధి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ అఖిల్ తో mr.మజ్ను సినిమా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి లాస్ట్ వీక్ లో ఆ సినిమా విడుదల కానుంది.