కన్నడ స్టార్ హీరో అర్జున్ ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. శృతి హరిహరన్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీ ప్రముఖులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఇక కొన్ని రోజుల క్రితం అర్జున్ ఆమెపై పరువునష్టం దావా వేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 

అయితే తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలనీ శృతి కోర్టును కోరగా ఆమె వాదనలను విన్న కోర్టు అర్జున్ కి షాక్ ఇచ్చింది. ఆరోపణలు చేసినందువల్ల కావాలనే ప్రతీకార చర్యలో భాగంగా శృతిపై పిర్యాదు చేయడం జరిగిందని అందుకే ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలనీ కోర్టు నుంచి శ్రుతికి అనుకూలంగా తీర్పు వెలువడింది. 

ఇక తనను వేధించాడంటూ శృతి అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. పలువురు వివాదానికి ఎండ్ కార్డ్ వెయ్యాలని అనుకున్నప్పటికీ ఇద్దరు రాజీకి రావడానికి తిరస్కరించారు. దీంతో వివాదం ఇప్పట్లో ఎండ్ అయ్యేలా లేదని సౌత్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.