తన వద్ద తరచుగా ఆభరణాలు కొనుగోలు చేసే యువతిపై అత్యాచారయత్నం చేశాడు ఓ ఆభరణాల వ్యాపారి. బెంగళూరు కురుబరహళ్లికి చెందిన సుభాష్ అనే వ్యక్తి రిషబ్ జ్యూవెలర్స్ పేరిట నగల దుకాణాన్ని నడుపుతున్నాడు.

ఆయన వద్ద తరచుగా నగలు కొనుగోలు చేసే ఓ 21 ఏళ్ల యువతితో సుభాష్‌కి మంచి పరిచయం ఏర్పడింది. ఆమెపై కన్నేసిన సుభాష్ ఎలాగైనా లోబరుచుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 26వ తేదీన నగలు కొనేందుకు దుకాణానికి వెళ్లిన యువతికి... ఇంట్లో కొత్త రకం డిజైన్లు ఉన్నాయని చెప్పాడు.

ఆమెను వెంటబెట్టుకుని అదే భవనంలోని పై అంతస్తులో ఉన్న ఇంటికి తీసుకెళ్లాడు. తలుపుకి గడియ పెట్టి యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె ఎలాగోలా తప్పించుకుని బయటికి పారిపోయింది.

అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. తన వద్ద అత్యాచారయత్నం చేసిన వీడియోలున్నాయని వాటిని సోషల్ మీడియాలో పెడతానని సుభాష్ బెదిరించాడు. భయపడిన యువతి స్నేహితురాళ్ల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుభాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

నలుగురి కోసం అమ్మాయిని పడేసి.. స్నేహితులతో కలిసి అత్యాచారం

ఎనిమిది మంది బాలికలపై అత్యాచారం: నిందితుడు అరెస్ట్

హోంగార్డుపై అత్యాచారం చేసి.. గది కడిగి వెళ్లిన కానిస్టేబుల్

దొంగతనానికి వచ్చి... మహిళపై అత్యాచారం

లేడీ కానిస్టేబుల్‌పై ఎస్ఐ రేప్‌.. వీడియో తీసి రెండేళ్లుగా అత్యాచారం

చిన్నారిపై అత్యాచారం, హత్య: తలను ముక్కలుగా నరికి, వెన్నెముక విరిచేసి..

విశాఖలో యువతిపై అత్యాచారం, హత్య...ప్రేమికుడిపైనే అనుమానం

కూతురిపై తండ్రి అత్యాచారం...మూడేళ్లుగా సాగుతున్నా తల్లి మౌనం

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

విద్యార్థినిపై లెక్కల మాస్టర్ అత్యాచారం... 21 ఏళ్లు జైలుశిక్ష

వదినపై మరిది అత్యాచారం.. విడాకుల నోటీసులు పంపిన భర్త