విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న సెంథిల్ కుమార్ అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిపై 2016లో అత్యాచారం చేశాడు..

దీనిపై బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెంథిల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సుధీర్ఘ విచారణ అనంతరం నిందితుడికి 21 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ మహిళా న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పును మహిళా సంఘాలు, గ్రామస్తులు, విద్యార్థినిని తల్లిదండ్రులు స్వాగతించారు.