హ్యూస్టన్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న హౌడీ మోడీ కార్యక్రమంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జేడీయూ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు.

మోడీ, ట్రంప్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఈ కార్యక్రమం వల్ల అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎంతో మేలు కలుగుతుందని పీకే అభిప్రాయపడ్డారు. దీనిని వ్యూహాత్మకమైన, తెలివైన చర్యగా ప్రశాంత్ అభివర్ణించారు.

త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు, ప్రవాస భారతీయులు ట్రంప్‌కి మరోసారి పట్టం కట్టాలంటూ మోడీ పిలుపునివ్వడాన్ని ట్రంప్ రాజకీయ ఎత్తుగడగా పీకే వర్ణించారు. అయితే ట్రంప్‌కు అనుకూలంగా మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం రాత్రి హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్జీ స్టేడియం మోడీ నినాదాలతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ తన ప్రసంగంతో అక్కడి భారతీయులలో ఉత్సాహం నింపారు. 

హౌడీ మోడీ : అమెరికా వేదికగా పాక్ ను టార్గెట్ చేసిన మోడీ

భారత్ లో ప్రతిదీ బాగుంది: తెలుగు సహా విభిన్న భాషల్లో మోడీ

హౌడీ మోడీ ఈవెంట్: 30 నిముషాలు ప్రసంగించనున్న ట్రంప్

మీరు చాల నష్టపోయారు, కలిసి నూతన కాశ్మీరును నిర్మిద్దాం: కాశ్మీరీ పండిట్లతో మోడీ

హౌడీ మోడీ ఈవెంట్ కు హ్యూస్టన్ ను వేదికగా ఎంచుకోవడానికి కారణాలు ఇవే...

మోడీ అమెరికా పర్యటన సాగనుంది ఇలా...

హౌడీ మోడీ ఈవెంట్ లో జనగణమన పాడనున్న భారత స్పెషల్ కిడ్

అమెరికాలో మోడీకి బ్రహ్మరథం: హౌడీ హ్యూస్టన్ అంటూ మోడీ పలకరింపు