Asianet News TeluguAsianet News Telugu

హౌడీ మోడీ : అమెరికా వేదికగా పాక్ ను టార్గెట్ చేసిన మోడీ

హౌడీ మోడీ భారీగా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ సమక్షంలో పేరెత్తకుండా పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

Howdy Modi: Indian PM Narendra Modi and and Trum at Houston
Author
Houston, First Published Sep 22, 2019, 8:46 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హౌడీ మోడీ అంటూ హ్యూస్టన్ అంతా మార్మోగుతోంది. ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ద్వారా హ్యూస్టన్ చేరుకున్నాడు. భారత, అమెరికా సాంప్రదాయ నృత్య, కళా రూపాల ప్రదర్శనలతో, సమ్ప్రదాయ వాయిద్యాలతో వాయిస్తున్న సంగీతంతో హ్యూస్టన్ లోని ఎన్ ఆర్ జి స్టేడియం మార్మోగుతోంది.. కీర్తనతో ప్రారంభమైన హౌడీ మోడీ. 

ట్రంప్ ను భరత్ కు ఆహ్వానిస్తూ, థాంక్యూ అమెరికా, ఠంక్ యు హ్యూస్టన్ అంటూ ప్రసంగాన్ని ముగించాడు.  ఆ తర్వాత మోడీ, ట్రంప్ సంయుక్తంగా ప్రేక్షకులకు అభివాదం చేశారు.

అమెరికన్ పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరిచిన మోడీ. తగ్గించిన కార్పొరేట్ టాక్స్ వల్ల మరిన్ని కంపెనీలు పెట్టుబడులుపెట్టేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. 

పాకిస్తాన్ పేరెత్తకుండా తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు. 

తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించిన మోడీ. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ చాల కృషి చేస్తున్నారంటూ కితాబిచ్చి స్టాండింగ్ ఓవషన్ ఇచ్చారు. 

అన్ని వర్గాలకు చెందిన ప్రజలను కలుపుకుపోతుంది సబ్ కే సాథ్ సబ్ కా విశ్వాస్- మోడీ 

ప్రజాస్వామ్యం, విభిన్నత భారతీయతకు చిహ్నాలు-మోడీ 

హౌడీ మోడీ కి సమాధానమిస్తూ.. భారత్ లో అందరూ బాగున్నారు అనితెలుగుతో సహా  వివిధ భాషల్లో చెప్పిన ప్రధాని మోడీ 

ప్రారంభమైన మోడీ ప్రసంగం. హిందీలో ప్రసంగం ఆరంభించిన మోడీ. 

అక్రమ వలసదారులకు మాత్రమే తాను వ్యతిరేకమని, లీగల్ గా వచ్చిన భారతీయులకు  పూర్తి సహకారం, వారి భద్రత, రక్షణ అన్ని అమెరికా బాధ్యత- ట్రంప్. 

త్రివిధ దళాల ఎక్సర్ సైజ్ ప్రారంభం. టైగర్ ట్రియంఫ్ గా నామకరణం. 

తీవ్రవాదంపై ఉక్కుపాదం. 

ఇంధన భద్రత గురించి పూర్తి సహకారం అందిస్తామని ట్రంప్ హామీ.

భారత్ లో ఎన్ బి ఏ బాస్కెట్ బాల్. ముంబైలో ప్రారంభం. 

అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల సహకారాన్ని పొగుడుతున్న ట్రంప్

ప్రారంభమైన ట్రంప్ స్పీచ్. మోడీకి ఎన్నికల్లో విజయం సాధించినందుకు కంగ్రాట్స్ తెలిపాడు. డోనాల్డ్ ట్రంప్ కన్నా గొప్ప అమెరికన్ ప్రెసిడెంట్ ను భారత్ చూడలేదు అంటూ భారతీయులపైనా భారతదేశంపైన తనకున్న ప్రత్యేక ఇంటరెస్ట్ ను చెప్పాడు. 

హ్యూస్టన్ టూ హైదరాబాద్ అనగానే గట్టిగా స్టేడియం లో అరుపులు.. 

 అబ్ కి బార్ ట్రంప్ సర్కార్ అంటూ  డైరెక్ట్ గా ట్రంప్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేసిన మోడీ. 

ట్రంప్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన మోడీ

గుడ్ మార్నింగ్ హ్యూస్టన్, గుడ్ మార్నింగ్ టెక్సాస్, గుడ్ మార్నింగ్ అమెరికా అంటూ ప్రసంగం ఆరంభించిన మోడీ. . 

ముగిసిన ఇరు దేశాల జాతీయగీతాలాపన. భారత్ జాతీయ గీతాన్ని ఆలపించిన స్పెషల్ కిడ్ స్పర్శ్. 

ప్రధాని భుజంపై చెయ్యివేస్తూ ఆప్యాయంగా పోడియం దెగ్గరకు చేరుకున్న ట్రంప్.  

కలిసి వేదికపైకి చేరుకున్న ట్రంప్, మోడీ  

వేదిక దగ్గరికి చేరుకున్న ట్రంప్ 

విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్ తో ముచ్చటిస్తున్న ట్రంప్.

 

తెలుగు ఐటమ్ సాంగ్ కు హూస్టన్ విశ్వవిద్యాలయం విద్యార్థులు నృత్యం చేశారు .రామ్ ప్రసాద్ దాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు.

 

మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని, గాంధీజీ చూపెట్టిన అహింస మార్గం  మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆధ్వర్యంలో సాగిన అమెరికన్ సివిల్ రైట్స్ మూమెంట్ ని ఎలా ప్రభావితం చేసిందో ఆ జ్ఞాపకాలతో ఫ్యూషన్ మ్యూజిక్ ప్రదర్శన. 

   మోడీ కి స్వాగతం పలుకుతూ తన స్పీచ్ ముగించిన డెమొక్రాట్ నేత.

గాంధీ నెహ్రూల గొప్పతనం గురించి వారి కొటేషన్ లను ఉటంకిస్తూ వారికి అబ్రహం లింకన్ మధ్య పోలిక చెబుతూ ప్రసంగించిన డెమొక్రాట్ల నేత.

గుజరాత్ గురించి మోడీ పక్కనుండగా గొప్పగా మాట్లాడిన నేత.

అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్రను కొనియాడిన డెమొక్రాట్ల నేత. 

డెమొక్రాట్లు రిపబ్లికన్లు అని తేడా లేకుండా క్లింటన్ నుండి ట్రంప్ వరకు ప్రతిఒక్కరు భారతదేశంతోని స్నేహాన్ని మరింతగా పెంపొందిస్తున్నారు. 

 

భారతదేశంతోని పెరుగుతున్న మైత్రికి దాన్ని పండుగలా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజు మనం ఇక్కడ కలుసుకున్నాం అని ప్రసంగిస్తున్న డెమొక్రాట్ నేత. 

మోడీకి ప్రపంచ ఇంధన రాజధాని హ్యూస్టన్ కి తాళం తెరిచామని సంకేతంగా తాళంచేతిని బహుకరించిన హ్యూస్టన్ నగర మేయర్. 

మోడీని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడుతున్న నేతలు, ప్రజలు.  

వేదికనెక్కిన మోడీ మోడీ మోడీ అంటూ మారుమోగుతున్న స్టేడియం

టెక్సాస్ ఎందుకు? కాలిఫోర్నియానో , వాషింగ్టన్ నాగరాన్నో కాకుండా టెక్సాస్ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. 

ఈ మాటను నిలబెట్టుకుంటూ మేము భారతదేశానికి అవసరమైన ఇంధనాన్ని సప్లై చేస్తాము. గతంలో కూడా టెక్సాస్ రాష్ట్రం సరఫరా చేసిన చమురు గురించి టెక్సాస్ సెనెటర్ ప్రకటించారు. 

దాదాపు 5 లక్షలమంది భారతీయ అమెరికన్లు టెక్సాస్ ని తమ హోమ్ టౌన్ గా గర్వాంగా చెప్పుకుంటారు. 

టెక్సాస్ ను ఎంచుకున్నందుకు మోడీ కి ధన్యవాదాలు. ఈ రెండు మిత్రదేశాలు ఈ రోజు తమ ఫ్రెండ్ షిప్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాయి. 

వచ్చిన అతిథులంతా భారతీయ సాంప్రదాయంలో నమస్కారం పెడుతూ సభికులకు అభివాదం చేసారు 

టెక్సాస్ సెనెటర్ అందరికి స్వాగతం పలుకుతున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్, ఇతర సెనెటర్ లను, కాంగ్రెస్ ప్రతినిధులకు ప్రోగ్రాం కి ఆహ్వానిస్తూ వారిని పరిచయం చేస్తున్నారు. 

భారత సంతతికి చెందిన వారు, అక్కడి స్థానికులు ఇద్దరు కలిసి ప్రదర్శిస్తున్న మెడ్లే లు, మాష్ అప్ సాంగ్స్ , ఫ్యూషన్ మ్యూజిక్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. 

 జోరుగా సాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు. భాంగ్రా ఆర్టిస్టుల ప్రదర్శన అదరగొట్టింది. దాదాపుగా 400మంది కళాకారులతో ప్రదర్శించిన నృత్య రూపకాలు అందరిని కట్టిపడేశాయి. 

వచ్చిన అతిథులు వారి  అకౌంట్లలో సెల్ఫీలు పోస్ట్ చేస్తూ ఈవెంట్ జోష్ లో మునిగితేలుతున్నారు. 

భారతీయులతోపాటు అమెరికాకి వచ్చిన  సాంప్రదాయాలు,కట్టుబాట్లు, ఆచారాలు, కళలు అక్కడి కళలతోని కలిసి ఎలా కొత్త రూపును సంతరించుకున్నాయో అందరికి అర్థమయ్యేట్టు వివిధ వాయిద్యాలతో ప్రదర్శిస్తూ చూపెట్టారు. ఫ్యూషన్ మ్యూజిక్ కు కొత్త భాష్యం చెప్పారు. 

భారతీయ పాటకు పాశ్చాత్య సంగీత వాయిద్యాలతో అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. 

అమెరికన్ ప్రజలు వారు నేర్చుకున్న భారతీయ కళలను ప్రదర్శించగా అక్కడ స్థిరపడ్డ మన భారతీయులు వారి సాంప్రదాయ నృత్య రూపకాలు ప్రదర్శించి ప్రజలు ఎంతలా కలిసిపోయి జీవిస్తున్నారో తెలియజేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios