హ్యూస్టన్: ఇంకొద్దిసేపట్లో ఆరంభమవనున్న హౌడీ మోడీ ఈవెంటులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపుగా 30 నిమిషాలపాటు ప్రసంగించే అవకాశం ఉందని ప్రోగ్రాం నిర్వాహకులు అంటున్నారు. ఇలా ట్రంప్ మోడీ తోపాటు వేదికను పంచుకొని ప్రసంగిస్తే, ఇరుదేశాల స్నేహం మరింత బలపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 

గతంలో వినిపించిన సమాచారం మేరకు ట్రంప్ కేవలం గెస్ట్ గా మాత్రమే పాల్గొంటారని అందరూ భావించారు. కాకపోతే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్ 30 నిముషాల పాటు ప్రసంగించనున్నారు. కేవలం ఈ హౌడీ మోడీ ఈవెంట్ ను అటెండ్ అవ్వడానికి మాత్రమే ట్రంప్ హ్యూస్టన్ వస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. 

నిన్న రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ట్రంప్ ఈ ఈవెంట్ వద్ద దాదాపు 100 నిముషాలు గడపనున్నట్టు తెలిపారు. ఈ ఒక్క హౌడీ మోడీ ఈవెంట్ తప్ప ట్రంప్ కు వేరే ప్రోగ్రామ్స్ ఏమి లేవు. అమెరికా దేశ 45వ అధ్యక్షుడైన ట్రంప్ కేవలం భారత్ తోని మైత్రిని మరింత దృఢపరచడానికి మాత్రమే ఈ ఈవెంట్ కు హాజరవుతున్నారట. 

భారత ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడేటప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రేక్షకుల్లో ఒకడిగా కూర్చొని మోడీ స్పీచ్ విననున్నారు. ఇలా ఈ 50వేలమంది భారతీయ అమెరికన్లు హాజరయ్యే ఈ సభలో భాగస్వామి అవడంద్వారా రానున్న అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 

ఈ ఈవెంట్ అవగానే ట్రంప్ అక్కడి నుండి ఒహియో చేరుకోనున్నారు.  సోమవారం ఉదయం పాకిస్తాన్ ప్రధాని  తోని ట్రంప్ సమావేశమవుతారు. తెల్లారి మంగళవారం రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ తో సుధీర్ఘ చర్చలు జరపనున్నారు. 

మీరు చాల నష్టపోయారు, కలిసి నూతన కాశ్మీరును నిర్మిద్దాం: కాశ్మీరీ పండిట్లతో మోడీ

హౌడీ మోడీ ఈవెంట్ కు హ్యూస్టన్ ను వేదికగా ఎంచుకోవడానికి కారణాలు ఇవే...

మోడీ అమెరికా పర్యటన సాగనుంది ఇలా...

హౌడీ మోడీ ఈవెంట్ లో జనగణమన పాడనున్న భారత స్పెషల్ కిడ్

అమెరికాలో మోడీకి బ్రహ్మరథం: హౌడీ హ్యూస్టన్ అంటూ మోడీ పలకరింపు