హ్యూస్టన్: వారం రోజులపాటు బిజీగా సాగనున్న మోడీ అమెరికా పర్యటన ప్రారంభమయ్యింది. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 11గంటలకు మోడీ హౌడీ మోడీ ఈవెంట్ లో పాల్గొనేందుకు హ్యూస్టన్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడ మోడీకి ఘన స్వాగతం లభించింది. 

భారత రాయబారి హర్ష వర్ధన్ శృంగలా, అమెరికా దౌత్యవేత్త కెన్ జెస్టర్ లు సంయుక్తంగా మోడీకి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్ రూముకు వెళ్లేంతవరకు కూడా రోడ్డుకు ఇరువైపులా భారత అమెరికన్లు నిలబడి మోడీకి ఆహ్వానం పలికారు. ఒక చేతిలో భారత జాతీయ పతాకం, మరో చేతిలో అమెరికా జెండాను చేతబూని వారు మోడీ కాన్వాయ్ వెళుతున్నంతసేపు హౌడీ మోడీ అంటూ నినాదాలు చేసారు. హోటల్ రూమ్ దెగ్గరికి కూడా మోడీని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

హ్యూస్టన్ లో ల్యాండ్ అవ్వగానే టెక్సాస్ సాధారణ పలకరింపు అయిన హౌడీ ( టెక్సాస్ ప్రాంతంలో హౌ డూ  యు డూ అనడానికి హౌడీ అనే పదాన్ని వాడుతుంటారు.) అంటూ  అక్కడి ప్రజలను పలకరించారు. హోటల్ గదికి చేరుకోగానే, హౌడీ టెక్సాస్ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. తమ సాంప్రదాయ పలకరింపుతో తమను పలకరించడంతో అక్కడి భారత అమెరికన్ ప్రజలు తెగ సంబరపడిపోతున్నారు. ట్విట్టర్ వేదికగా ఎందరో మోడీ మెసేజ్ ను రీ ట్వీట్ చేసారు. 

నేటి సాయంత్రం 6.30గంటలకు మోడీ ఇక్కడి హ్యూస్టన్ నగరంలో ఏర్పాటు చేసిన హౌడీ మోడీ ఈవెంట్ లో పాల్గొంటారు. దాదాపుగా 50వేల మంది భారతీయ అమెరికన్లు ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గత మాడిసన్ స్క్వేర్ ఈవెంట్ కన్నా ఇది రెండింతలు పెద్దది. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ సభకు హాజరవ్వనున్నాడు. ఇంత భారీ సంఖ్యలో  భారతీయ అమెరికన్లను ఒకే చోట ఉద్దేశించి ప్రసంగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెకార్డులకెక్కనున్నాడు. 

కాశ్మీర్ విషయంలో ప్రపంచమంతా భారత దేశానికి మద్దతు పలుకుతుందని మరోమారు ఈ సభ ద్వారా చాటిచెప్పే ఛాన్స్ కూడా మనకు దక్కింది

హౌడీ మోడీ ఈవెంట్ లో జనగణమన పాడనున్న భారత స్పెషల్ కిడ్