హూస్టన్: భారతదేశంలోని వైవిధ్యాన్ని, విభిన్నతను చెప్పడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ తనదైన శైలిలో ప్రసంగించారు. ఇండియాలో ఎలా ఉందని అడుగుతున్నారని అంటూ ప్రతిదీ బాగుందని భారతదేశంలోని విభిన్న భాషల్లో అదే విషయాన్ని చెప్పారు. తెలుగులో కూడా ఆయన విషయాన్ని చెప్పారు. 

ట్రంప్ తో కలిసి చేతిలో చేయి వేసుకొని స్టేడియం చుట్టూ తిరుగుతున్న మోడీ. 

తమ భాషలు తమ స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక సమాజానికి గొప్ప ప్రతినిధ్యం వహిస్తాయని మోడీ అన్నారు. శతాబ్దాలుగా వేలాది భాషలు భారతదేశంలో కలిసి మనుగడ సాగిస్తున్నాయని ఆయన చెప్పారు.

అమెరికాలోని హూస్టన్ వేదికగా జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారతదేశంలోని విభిన్నతలో ఐక్యతను ఆయన చాటారు.

దాదాపు 50 వేల మంది ఇండో అమెరికన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మోడీకి ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఐక్యతను చాటేందుకు వారు ప్రయత్నించారు.